ఏ పుస్తకాలో... విద్యార్థుల రికార్డులో ఉండాల్సిన లాకర్లలో బంగారు కడ్డీలు.. కోటి రూపాయల నగదు బయట పడ్డాయి. దీన్ని చూసిన ప్రిన్సిపల్ అక్కడున్నఅధికారులందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటని విస్తుబోయారు. పాఠశాలలోనా.. అందునా ప్రభుత్వ పాఠశాలలోనా.. ఇక్కడకు ఇది ఎలా వచ్చిందనే అంశాన్ని కనుగొనే పనిలో పడ్డారు పోలీసులు. ఇంతకీ ఈ సంఘన ఎక్కడ జరిగింది? వివరాలు కావాలంటే అహ్మదాబాద్ వెళ్లాల్సిందే.
గుజరాత్ రాష్ట్రం, అహ్మదాబాద్ నగరం,
చంద్రఖేదలోని ఓఎన్ జీసీ క్యాంపస్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయలో వాడకంలో లేని
లాకర్లు ఉన్నాయి. వాటన్నింటిని శుభ్రం చేసే పనిలో పడ్డారు ప్రిన్సిపల్
లవదేశ్ కుమార్. చాలా కాలంగా వాడకంలోని 20 లాకర్లను గుర్తించారు. అన్నింటిని
శుభ్రం చేశారు. అయితే వీటిలో 5 లాకర్లకు తాళాలు లేవు. దీంతో వాటిని బద్దలు
కొట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
అందులోని రెండు లాకర్ల నుంచి బ్యాగులు
బయటపడ్డాయి. అదేంటో చూద్దామనుకున్న సిబ్బంది వాటిని తెరచి ఆశ్చర్య పోయారు.
వాటిలోంచి 100 గ్రాముల బరువున్న 21 బంగారపు కడ్డీలు బయటపడ్డాయి. అలాగే కోటి
రూపాయల నగదు కూడా బయట పడింది. దీంతో పిన్సిపాల్ పోలీసులకు సమాచారం
అందించారు. ఈ లాకర్లు ఎవరు వినియోగించారన్న సమాచారం దొరకలేదు. ఆదాయపన్ను
శాఖ అధికారులు పన్నుఎగవేత కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
0 comments:
Post a Comment