సర్పంచ్ పదవి కోసం రూ.2 కోట్ల ఉద్యోగాన్ని వదిలేశాడా? నమ్మసఖ్యంగా లేదు అనుకుంటున్నారు కదూ.. నిజమేనండి.
రాజస్థాన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం
విద్యావంతులైన యువతలో కదలికను తీసుకొస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ దిగే
అభ్యర్థులకు ప్రభుత్వం కనీస విద్యార్హత ఉండాలనే నియమము తీసుకురావడంతో
విద్యావంతులు సైతం సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
ఇందులో విచిత్రమేమిటంటే..? విదేశంలో
ఉద్యోగం, కోట్లలో జీతం తీసుకుంటున్న ఓ యువకుడు కూడా సర్పంచ్ పదవికి పోటీ
పడేందుకు సిద్ధపడ్డాడు. ఆ యువకుడే ఆస్ట్రేలియాలోని గోల్ట్ కోస్ట్‌లో
మేనేజర్‌గా పనిచేస్తున్న హనుమాన్ చౌదరి (27). అతని వార్షిక జీతం రూ.
2కోట్లు కావడం గమనార్హం.
పంచాయతీ సభ్యులుగా పోటీకి ఎనిమిదో తరగతి,
సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటే పదోతరగతి పాస్ కావాలన్న ప్రభుత్వ నిబంధనతో
గ్రామీణ ప్రాంతాల్లో 85 శాతం మంది పోటీకి అనర్హులయ్యారు. దీనిపై జోక్యానికి
రాష్ట్ర హైకోర్టు కూడా నిరాకరించింది.
ఈ నేపథ్యంలో నాగౌర్ గ్రామానికి చెందిన తన
తండ్రి భురారాం పిలుపుతో ఆస్ట్రేలియా నుంచి గ్రామానికి వచ్చిన హనుమాన్
చౌదరి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఆరువేల ఓట్లతో భారీ విజయం
కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న హనుమాన్ చౌదరి తన గ్రామంలో కుల
రాజకీయాల సంగతి అవగాహన ఉందన్నారు. తన సోదరుడి సహకారం వల్లే తాను పోటీ
చేస్తున్నాని చెప్పారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను పోటీలో
దిగుతున్నట్లు తెలిపారు.
0 comments:
Post a Comment