CSS Drop Down Menu

Friday, February 27, 2015

"ప్రపంచం"లోనే "నెంబర్1" నగరంగా నిలిచిన "ఢిల్లీ"?

ప్రపంచంలోనే మిగతా అన్ని నగరాలను దాటి ఢిల్లీ నెంబర్ 1 నగరంగా నిలిచింది. అయితే ఏ విభాగంలో తెలుసుకుంటే తలదించుకోవడం ఖాయం. కాలుష్యం విషయంలో. వాయు కాలుష్య, ప్రజారోగ్య శాఖ ఇటీవల జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

ఢిల్లీలో సగటున సెకనుకు 10 మైక్రోమీటర్ల సాంధ్రతతో గాలి కలుషితమవుతోందని, దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం అధికమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ సర్వే వివరాల ప్రకారం, మొత్తం కాలుష్యంలో ఢిల్లీ (పిఎం 10), జార్ఖండ్ (సల్ఫర్ డయాక్సైడ్), పశ్చిమబెంగాల్ (నైట్రోజన్ డయాక్సైడ్) తొలి స్థానాల్లో ఉన్నాయి. వాహనాల సంఖ్య పెరగడం, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలని వివరించింది. మొత్తం 170 దేశాల్లో కాలుష్యాన్ని పరీక్షించగా, చైనా, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లను భారత్ వెనక్కు నెట్టింది.
 



0 comments:

Post a Comment