CSS Drop Down Menu

Wednesday, February 25, 2015

పళ్లు, కూరగాయలతో కొలెస్ట్రాల్‌కు చెక్ ?

ఆధునిక జీవశైలిలో మార్పుల వల్ల, నిత్యం వ్యాయామం చేయడం కుదరని పని, దీంతో శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది. దానికి తోడు ఎక్కువ కేలరీలున్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా కొవ్వు పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ఫ్యాట్‌ను తగ్గించడానికి ఎంతైనా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తక్కువ క్యాలరీ ఉండే ఆహారం తీసుకోవాలి.
 
పళ్లు, కూరగాయల్లో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. తాజా కూరగాయలను ఉడకబెట్టి తింటే బరువు బాగా తగ్గుతారు. తాజా పళ్లు తిన్నా కూడా బరువు తగ్గుతారు. సలాడ్‌లు కూడా మంచివే. వాటిల్లో రుచి కోసం మిరియాల పొడి, ఉప్పు చల్లుకుని తినొచ్చు. సలాడ్‌లను స్నాక్స్‌లా కూడా తీసుకోవచ్చు. పళ్లు, కూరగాయల్లో సొల్యుబుల్, నాన్ సొల్యుబుల్ పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 

0 comments:

Post a Comment