ఫ్యాన్స్ చేసే చిత్రమైన పనుల్లో హీరోలు
ఏదోదే మాట్లాడుతుంటారు. అభిమానులే దేవుళ్లు అంటూ తెగ పొగిడేస్తుంటారు. ఇలా
చాలామంది అన్నవారే. కానీ వారు శ్రుతిమించిన అల్లరితో కంట్రోల్ చేయడానికి
ఏమీ చేయలేక వెంటనే నోరు జారిన సంఘటనలు పలు సందర్భాల్లో వున్నాయి. అందులో
తాజాగా నాగార్జున కూడా చేరిపోయారు. తన కొడుకు అఖిల్‌ను పరిచయం చేసే క్రమంలో
ఫ్యాన్స్ ఎక్కువగా సందడి చేయడంతో తను మాట్లాడేది విన్పించడంలేదనీ
వెంటనే... మీరు నోరు మూసుకుంటే నేను మాట్లాడతా' అంటూ వ్యాఖ్యానించారు.
దీంతో ఒక్కసారిగా సైలెంట్ అయిన
ఫ్యాన్స్... నాగ్ ఇలా అన్నాడేమిటి? అని కొందరు ఆశ్చర్యపోయారు. తర్వాత
మాట్లాడుతూ.. పలు విషయాలు చెప్పాడు. అయితే స్టేజీపై వున్న ఓ ప్రముఖుడు ..
నాగ్ మాట్లాడింది గుర్తు చేశారు. వెంటనే.. మళ్ళీ వారిని స్తుతిస్తూ
మాట్లాడి.. హుషారుపర్చారు.. అదీ విషయం.
0 comments:
Post a Comment