CSS Drop Down Menu

Thursday, February 19, 2015

"బిక్షగాళ్ళ" అవతారం ఎత్తనున్న డిస్ట్రిబ్యూటర్లు ?

ఒకప్పుడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అంటే నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు కామధేనువు. పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఆయన సినిమాలంటే వారికి భయమేస్తుంది. 'లింగా' సినిమానే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఆ చిత్రాన్ని రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మించారు.
 
కాగా, లింగ సినిమా అన్నిచోట్ల ఆడలేదు. ఆడిన థియేటర్లలో జనాలులేక కలెక్షన్లురాక పెట్టిన పెట్టుబడి తిరిగిరాక డిస్ట్రిబ్యూటర్లు ఆమధ్య రజనీకాంత్‌, నిర్మాతలను అడిగారు. అందుకు పదిశాతం మాత్రమే తిరిగి ఇస్తానని నిర్మాత ప్రకటించడంతో సోమవారంనాడు డిస్ట్రిబ్యూటర్లంతా ఓ వింత నిర్ణయాన్ని తీసుకున్నారట. 
 
రజనీకాంత్‌, నిర్మాత ఇంటిముందు భిక్షాటన చేయాలనేది ప్లాన్‌. అంతేకాకుండా థియేటర్లలో ఒక చిప్ప పెట్టి... అందులో మాకు దానం చేయండని. ప్రేక్షకులను అడిగే కాన్సెప్ట్‌. ఇలాంటి చిత్రమైన కోరికకు నిర్మాత ఎలా రియాక్ట్‌ అవుతాడో త్వరలో తేలనుంది.

0 comments:

Post a Comment