టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు
వార్తలకెక్కారు. ఈ దఫా టాలీవుడ్ అగ్రహీరోయిన్ అనుష్కను లక్ష్యంగా చేసుకుని
హాట్‌హాట్ కామెంట్స్ చేశారు. అనుష్క ప్రధాన పాత్రధారిణిగా, దర్శకేంద్రుడు
కె.రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన 'సైజ్ జీరో' చిత్రం
ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో
అలీ పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనుష్క తొడలను రచ్చ రచ్చ
చేశాడు. ఆమె తొడలు అద్భుతమని ఆ తొడలంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. తొడలంటే
అనుష్క తొడలే అంటూ అనుష్క తొడలపై పెద్ద చర్చే లేపారు. 'బిల్లా' సినిమాలో
ఆమె తొడలు చూసిన నుంచి తాను పెద్ద ఫ్యాన్ అయిపోయానని చెప్పాడు.
అంతేకాకుండా, అనుష్క హాట్‌హాట్ జిలేబిలా
ఉంటుందన్నారు. జిలేబి అంటే ఇష్టపడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండరన్నారు.
అందుకే ప్రకాష్... అనుష్కను ఈ చిత్రంలో జిలేబీలతో కొట్టించారన్నారు. దీనికి
కారణం లేకపోలేదన్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు తీసిన సినిమాల్లో
నటించిన హీరోయిన్లందరినీ ప్రపంచంలోని పూలు, పండ్లతో కొట్టించడమే కాకుండా,
ఎంతో మంది అమ్మాయిల తొడలను ఈ ప్రపంచానికి చూపించారన్నారు.
ఇపుడు ఆయన తనయుడికి హీరోయిన్లను
కొట్టించేందుకు పండ్లు పూలు లేకపోవడంతో జిలేబీలను ఎంచుకున్నారంటూ సెటైర్లు
వేశారు. అలీ చేసిన ఈ కామెంట్స్‌కు ఆడియో ఫంక్షన్‌కు హాజరైన ఆహుతులు.. తమ
ముఖాలకు చేతులు అడ్డంపెట్టుకుని బలవంతపు నవ్వుతో నవ్వారు. అనుష్క కూడా ఈ
కామెంట్స్‌కు ఎలా స్పదించాలో తెలియక మిన్నకుండిపోయారు.
కాగా, ఇటీవలి కాలంలో అలీ చేస్తున్న
వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్‌లో రచ్చరచ్చ జరుగుతున్నా ఈ స్టార్ కమెడియన్
మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పైగా... మరింత రెచ్చిపోయి
అగ్రహీరోయిన్లను సైతం వదిలిపెట్టడం లేదు కదా.. ఏకంగా హీరోయిన్ల శరీర
అవయవాలపై సెటైర్లు వేస్తూ వార్తల్లో నానుతున్నాడు.
0 comments:
Post a Comment