డాడీ నాగ్ మీద అఖిల్ గుర్రుగా వున్నాడట. తన ‘అఖిల్’ మూవీ వాయిదా వేయాలని
నాగార్జున తీసుకున్న నిర్ణయం ఈ యువహీరోని అప్‌సెట్ చేసిందంటున్నారు.
నిజానికి ‘అఖిల్’ మూవీ గతనెల దసరా నాటికి రిలీజ్ అవుతుందని భావించారు.
అయితే టెక్నికల్ రీజన్స్ వల్ల అది రిలీజ్ కాలేకపోయిందని వార్తలు వచ్చాయి.
అసలు కారణం అది కాదని, ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ని రీషూట్ చేయాలని నాగ్
సూచించారని, అందువల్ల వాయిదా పడిందని కూడా ఫిల్మ్‌నగర్‌లో న్యూస్ చక్కర్లు
కొట్టింది. ఏదిఏమైనా అఖిల్ మాత్రం మనస్తాపం చెందాడట! తన మూవీ ప్రమోషన్ కోసం
అఖిల్ చాలారోజుల క్రితమే హైదరాబాద్ వుమెన్స్ కాలేజీలో హల్‌చల్
చేయడంతోబాటు, యూఎస్ కూడా వెళ్లి అక్కడా ప్రమోట్ చేసి వచ్చాడు.
కానీ నాగ్ తీసుకున్న నిర్ణయంతో అలిగిన అఖిల్ రెండు రోజులు ఎవరితోనూ
మాట్లాడలేదట. నాగార్జున ఫోన్ చేసినా స్పందించలేదట. ప్రెస్‌మీట్‌కు హాజరు
కాకపోవడంతో నాగార్జునే అటెండ్ అయి లాంఛనంగా ప్రకటన చేశాడు. తన తండ్రి తన
ఫేవరేట్ యాక్టర్ కాదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అఖిల్ వ్యాఖ్యానించడం అక్కినేని
ఫ్యాన్స్‌ని షాక్‌కి గురిచేసింది. బహుశా తన ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి
తనయుడు రామ్‌చరణ్ నటించిన ‘బ్రూస్‌లీ’ సినిమా.. దసరాకి రిలీజ్ అయ్యేలా
చూసేందుకే నాగ్.. ఆ డెసిషన్ తీసుకున్నారా అనే కామెంట్స్ వినబడుతున్నాయి. చివరకు మొన్న నాగ్ రిలీజ్ డేట్ ప్రకటనతో .. తండ్రీ కొడుకుల మధ్య రేగిన ‘కోల్డ్‌వార్’కు ఫుల్‌స్టాప్
పడినట్టే చూడాలి.
0 comments:
Post a Comment