CSS Drop Down Menu

Friday, November 20, 2015

బ్రహ్మానందం తన కెరీర్ ను తనే నాశనం చేసుకుంటున్నాడా ?

దాదాపు 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో టాప్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగి గిన్నిస్ బుక్ లో స్థానం దక్కించుకున్న బ్రహ్మానందం హవా ఈమధ్య పూర్తిగా తగ్గిపోయింది. అయితే అతనికి ఇటువంటి పరిస్థితి రావడంపై కొన్ని పుకార్లు పరిశ్రమలో హడావుడి చేస్తున్నాయి. అవేమిటంటే దర్శకులని బ్రాహ్మి చిన్న చూపు చూస్తాడని టాక్.

పారితోషికం కోసం కొత్త దర్శకుల సినిమాల్లో నటిస్తాడు కానీ, ఆ దర్శకులు చెప్పే వాటిని బ్రాహ్మి పట్టించుకోడని, సినిమాలో బ్రాహ్మి నటించాల్సిన సీన్ గురించి చెబితే దీనికి ఇంతొద్దు….ఈమాత్రం చాలు అంటాడట. అంతేకాదు ఆ సీన్ ని ఆయనే ఎడిట్ చేస్తాడట. అలాగే ఆ సినిమాకి సంబందించిన కాజువల్ వాక్ లేదా వాకవే సీన్ తీయాలంటే షూట్ చివర్న వెల్లిపోయేటప్పుడు తీసుకో, మళ్ళీ దానికి ప్రత్యేకంగా యాక్ట్ ఎందుకు అని సెటైర్స్ వేస్తాడని ఫిలిం నగర్ గాసిప్.

దాని ఫలితంగా ప్రస్తుతం చాలామంది కొత్త దర్శకులు అయన టార్చర్ భరించలేక కొత్త హాస్య నటులతో సినిమాలు తీస్తున్నారు. అంతేకాదు ఈమధ్య బాగా పేరులోకి వస్తున్న ఓ దర్శకుడు బ్రాహ్మి గురించి తన సన్నిహితులతో మాట్లాడుతూ బ్రాహ్మి 65 ఏళ్ల వయసులో మరికాస్త కొత్తగా చేద్దామనే ప్రయత్నం చేయడం లేదని అందుకే అయన కామెడీ మొహం
  మొత్తుతోందని కామెంట్ చేసినట్లు టాక్.

ఈ కారణాలు వల్లే చిన్న దర్శకుల నుండి పెద్ద దర్శకులవరకు పృధ్వీ, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సప్తగిరి లాంటి కమెడియన్లకు వరస పెట్టి అవకాశాలు ఇస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. పైగా బ్రహ్మీకి రోజుకు నాలుగు నుంచి అయిదు లక్షలు కావాలి. అదే డబ్బుతో కొత్త కమెడియన్ల బ్యాచ్ వస్తుంది కదా అన్న నేటితరం దర్శకుల ఆలోచనలు ప్రస్తుతం బ్రహ్మికి శాపంగా మారింది అనే వార్తలు హడావిడి చేస్తున్నాయి.


0 comments:

Post a Comment