చిన్న వయస్సులోనే జుట్టు నెరసిపోతే..
కరివేపాకు ఉపయోగించండి. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జుట్టు నెరవడం సహజమే.
కానీ కొందరికి 20 ఏళ్లు కూడా నిండకుండా జుట్టు తెల్లబడిపోతుంది. ఈ సమస్య
అమ్మాయిల్లో తలెత్తితే మరీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటివారికి కరివేపాకు
హెయిర్ టానిక్‌లా పనిచేస్తుంది.
కరివేపాకును బాగా ఉపయోగించేవారికి జుట్టు
అంత త్వరగా తెల్లబడదు. శిరోజమూలానికి బలం చేకూర్చే గుణంతోపాటు జుట్టుకు
మంచి రంగును ఇచ్చే గుణం కరివేపాకులో ఉన్నది.
ఇందుకుగాను ఒక కప్పు కొబ్బరి నూనెను
తీసుకుని అందులో 20 కరివేపాకు ఆకులను వేసి కొద్దిసేపు వేడి చేయాలి.
కరివేపాకులు నల్లగా మారిన తర్వాత వేడి చేయడం ఆపేసి దించేయాలి. ఇలా వచ్చిన
నూనెను వారంలో రెండుమూడుసార్లు మాడుకు మర్దన చేస్తుంటే శిరోజాలు బాగా
పెరగడంతోపాటు తెల్లబడటం కూడా తగ్గుతుంది. చక్కని రంగుతో నిగనిగా
మెరిసిపోతాయి.
0 comments:
Post a Comment