CSS Drop Down Menu

Monday, November 2, 2015

"మెగా ఫ్యామిలీ స్టార్స్ సినిమాలపై వర్మ కామెంట్ల"కు ఇదా కారణం ?

సినీ ఇండస్ట్రీలో కొందరిని చేదు అనుభవాలు అలానే వేధిస్తుంటాయి. పీడిస్తుంటాయి. వాటిని ఎంత మర్చిపోదామన్నా వల్లకాదు. అలాగే రాంగోపాల్ వర్మ పరిస్థితి కూడా ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మెగా ఫ్యామిలీ స్టార్స్ సినిమాలపై వర్మ కామెంట్లు అందుకే చేస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. 20 ఏళ్ల కిందట మెగాస్టార్ చిరు చిత్రంతో జరిగిన అవమానం ఇంకా వర్మను పీడిస్తోందట.
 
అందుకే బ్రూస్‌లీ చిత్రమే మెగాస్టార్‌ 150వ చిత్రంగా తాను భావిస్తున్నానని వర్మ ట్వీట్ చేయడం వెటకారమైనదని అంటున్నారు. ఇంకా ఈ బ్రూస్ లీ చిత్రంలో చిరు నటించడం తనకు అస్సలు నచ్చలేదనీ, బ్రూస్‌లీలో చిరు నటించడం ప్రజారాజ్యం పార్టీ పెట్టినంత తప్పని, తెలిసితెలిసి మెగాస్టార్‌ ఆ పని చేశారేంటబ్బా అని వర్మ విమర్శించారు.
 
ఇంకా ఈమధ్య చిరంజీవి చేయబోతున్న తదుపరి చిత్రం కత్తికి రీమేక్‌ అనే వార్తపైనా వర్మ మండిపడ్డారు. ఇలా చేస్తే మెగా అభిమానులను అవమానించడమే అవుతుందని చెప్పుకొచ్చారు. ఐతే ఇలా మెగా స్టార్స్ పైన వర్మ ట్వీట్లు చేయడం వెనుక వేరే కారణాలు ఉన్నాయనీ, 20 ఏళ్ల కిందట వర్మకు చిరు ఓ సినిమాకు ఛాన్స్‌ ఇచ్చాడట. అశ్వనీదత్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో శ్రీదేవిని హీరోయిన్‌గా తీసుకోవడమే కాకుండా కర్నూల్‌లో షూటింగ్‌ పార్ట్‌ కూడా కొంత జరిపారట. 
 
ఐతే ఆ తర్వాత వర్మ పద్ధతి నచ్చక చిరంజీవి ఆ చిత్రం నుంచి వర్మను తప్పించారట. అంతేకాకుండా 150వ చిత్రం చేసే అవకాశాన్ని తన ప్రియ శిష్యుడు పూరీ జగన్నాథ్ కు ఇవ్వకుండా మరొకరిని ఆలోచించడం కూడా వర్మకు నచ్చలేదని సమాచారం. అందువల్లనే చిరంజీవికి వర్మ మెత్తని సెటైర్లు వేస్తున్నారని అంటున్నారు.
  

0 comments:

Post a Comment