అతనో ఇరవై ఎనిమిదేళ్ళ అందగాడు. అతనంటే ఇష్టపడే అమ్మాయిలు కూడా ఉన్నారు.
కానీ అతనికి క్యాన్సర్ వ్యాధి సోకిందని వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో
అతను పెళ్లి ఆలోచన మార్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటే కొద్ది కాలానికే
అమ్మాయి విడో గా మిగిలిపొతుందని భావించి ఆ యువకుడు ఓ కొత్త పెళ్లికి
తెరతీశాడు.
వివరాల్లోకి వెళ్తే...చైనాకు చెందిన ఒక కుర్రవాడు మంచి స్మార్ట్ గా
ఉంటాడు కానీ, డాక్టర్లు అతనికి టెర్మినల్ క్యాన్సర్ అని తేల్చారు.
మరణానికి దగ్గరగా ఉన్న అతను అది సంభవించే లోపే ... పెళ్లి అనే తీయని
అనుభూతిని అనుభవించాలనుకున్నాడు. తన పెళ్ళి కోరిక తీరేలా, ఎవరికీ అన్యాయం
జరగకుండా ఉండేలా ఒక ప్లాస్టిక్ బొమ్మతో పెళ్ళికి రెడీ అయ్యాడు.
అతనితో బాటే ఆ బొమ్మ పెళ్లి కూతురికి మేకప్ చేశారు. పెళ్లి డ్రస్
తొడిగారు. ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. అందరూ అతని ఆలోచనను అభినందించారు.
అందరూ ఆశ్చర్యపోయేలా, సంప్రదాయ బద్ధంగా ప్లాస్టిక్ పెళ్ళి కూతురితో
వివాహం చేసుకున్నాడు.
మోకాళ్ల మీద వంగి ప్లాస్టిక్ పెళ్లి కూతురికి వామ్ వెల్ కమ్ చెబుతున్న
ఫోటోలు కూడా పోస్ట్ చేశాడు. పెళ్ళి తంతు అయిపోయిన తరువాత 35 వేల డాలర్ల
ఖర్చుతో పెళ్ళి విందు కూడా ఇచ్చాడు. అందరికీ ఆశ్చర్యం కలి గించేలా చైనాలో
జరిగిన ఈ పెళ్లి వివరాలు, ఫోటోలు ఇంటర్నెట్ లో తెగ చూసేస్తున్నారు. ఆ చైనా
కుర్రాడిని మెచ్చుకుంటున్నారు .
ReplyDeleteచాలా మంచి పని చేసాడీ అబ్బాయి . వేరే దేశాల్లో అయితే బీద దేశం లో నించి అమ్మాయి ని తెప్పించు కుని పెళ్లి చేసుకుని ఆవిణ్ణి తగలేసి ఉండే వారేమో !
ఈ చైనా అబ్బాయి రియల్లీ సూపర్
జిలేబి