కేమరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా.. ఈ మూడు దేశాల్లో ఆడ పిల్లలుగా
పుట్టడం కంటే.. అడవిలో మానై పుట్టడమే మేలనుకుంటారట. అక్కడ ఆడపిల్లలు
యుక్తవయసుకొస్తున్నారంటే చాలు. ప్రాణాలు గిజగిజలాడి పోతాయట. వయసు తో బాటు
నాచురల్ గా పెరిగే ఛాతి పెరగకుండా వాటిని ఆటవిక పధ్ధతుల్లో అణిచి
వేస్తారట.
బ్రెస్ట్ ఐరనింగ్ అని పిలిచే ఈ ప్రక్రియలో ఛాతి కనపించకుండా అణచివేస్తే
ఆడపిల్లల వయసు దాచిపెట్టడంతో బాటు, వారి మీద మగవాళ్ల కన్ను పడకుండా
ఉండేందుకు ఈ ఆటవిక పద్దతిని అవలంబిస్తున్నారట. ఈ అనాగరిక మూఢ నమ్మకంలో
తల్లులే ముఖ్య పాత్ర వహిస్తున్నట్టు యునైటెడ్ నేషన్స్ నివేదిక పేర్కొంది.
తమ పిల్లలకు బ్రెస్ట్ ఐరనింగ్ చేస్తే లైంగిక వేధింపులు, అత్యాచారాలనుంచి
రక్షణ కలుగుతుందన్న మూఢనమ్మకమేకారణమట.
ఈ బ్రెస్ట్ ఐరనింగ్ కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 3.8 మిలియన్ల
మంది నానా హింస బారిన పడి నరకం చూస్తున్నట్టు యూ ఎన్ నివేదిక పేర్కొంది.
ఆడతనాన్ని ప్రతిబింబించే ఛాతి పెరగనీయకుండా ఉండేందుకు తల్లులు
ఆశ్రయిస్తున్న అనాగరిక పద్దతి దారుణంగా ఉంటుందట. పెద్ద పెద్ద రాళ్లు, లేదా
వెడల్పాటి గరిటె లాంటి దాన్ని బొగ్గుల మీద కాల్చి వాటితో ఛాతిని అణుస్తారట.
ఈ పద్ధతిలో బ్రెస్ట్ టిష్యూ దారుణంగా దెబ్బ తింనడం వల్ల ఆడతనం
అణిగిపోతుందనేది తల్లుల భావనట.
కామెరూన్, నైజీరియా, సౌత్ ఆఫ్రికా తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఆనాగరిక
ఆచారంలో 58 శాతం తల్లులే ప్రధానంగా ఉన్నారని పబ్లి్క్ హెల్త్ సర్వీస్
లెక్కలు చెబుతున్నాయి. డబ్బున్న కుటుంబాలకు చెందిన యువతులైతే వెడల్పాటి
బెల్టు గట్టిగా చుట్టుకుంటారట. దీని కారణంగా ఛాతి పెరగవట.
ముఖ్యంగా 11,15 సంవత్సరాల మధ్య వయసున్న ఆడపిల్లల్లో శరీర భాగాలు
పురుషుల కంట బడనీయక పోతే మగాళ్ళ కళ్ళు తమ పిల్లల మీద పడవని ఆ తల్లుల
నమ్మకమట. మహిళల మానసిక స్థితి మీద కూడా ప్రభావం చూపుతున్న ఈ అనాగరికపు
ఆచారం మీద ఇప్పుడిప్పుడే చైతన్యం ప్రారంభమైంది.