CSS Drop Down Menu

Wednesday, January 7, 2015

"పైనాపిల్‌" తినే ముందు ఏం చేయాలి ?


 పైనాపిల్ తినడం వల్ల కొందరి ఆరోగ్యానికి పడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొంత మంది మహిళలలో అలాగే పురుషులలో పైనాపిల్ అలర్జిక్ రియాక్షన్స్ చూపిస్తుంది. పైనాపిల్ తినడం వల్ల స్వల్ప అలర్జిక్ రియాక్షన్స్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ.

పెదవి వాపు, గొంతులో దురదవంటివి దీని లక్షణాలు. ఈ సమస్యను అధిగమించేందుకు పైనాపిల్‌ను తినే ముందు పైనాపిల్ ముక్కలను శుభ్రమైన సాల్ట్ వాటర్‌లో క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ పండులోనున్న ఎంజైమ్స్ తొలగిపోతాయి. తద్వారా రాషెస్ రాకుండా జాగ్రత్తపడవచ్చు.

అలాగే పైనాపిల్‌లో సహజసిద్ధంగా షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. సుక్రోస్, ఫ్రక్టోస్‌లు ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధితో బాధపడుతున్నవా
రిపై పైనాపిల్ దుష్ప్రభావం ఉంటుంది. పైనాపిల్ పండుని తీసుకున్న స్థాయిని బట్టి దాని దుష్ప్రభావం ఉంటుంది.

 రక్తంలోని షుగర్ లెవల్‌ను నియంత్రించడానికి పైనాపిల్‌ను మితంగా తీసుకోవాలి. రోజుకు రెండుసార్లకే పైనాపిల్‌ను పరిమితం చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 


0 comments:

Post a Comment