తెలంగాణ ముఖ్యమంత్రి ఓఎస్డీ, గాయకుడు దేశపతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
చేశారు. విద్యార్థులు తప్పుదోవపట్టేలా తన సినిమాల ద్వారా చెడు
సందేశాలిస్తున్న దర్శకుడు పూరి జగన్నాథ్ తన కంటపడితే ఆయన చెంప పగలగొడుతానని
అన్నారు. స్ర్తీలు, గురువులని అవమానించేరీతిలో సినిమాలు తీస్తున్న ఆయన తన
తీరు మార్చుకోవాలని దేశపతి హితవు పలికారు.
ప్రజలకు మేలు కలిగే విధంగా సందేశాలిచ్చే సినిమాలు తీస్తే వర్కౌట్ కాదని
వ్యాఖ్యానించిన పూరి జగన్నాథ్ వ్యక్తిత్వం ఎటువంటిదో గ్రహించాల్సిన అవసరం
వుందని దేశపతి అభిప్రాయపడ్డారు. మెదక్ జిల్లాలో ఓ కాలేజీలో జరిగిన సెమినార్
కార్యక్రమంలో ఆయన ఈ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు.
0 comments:
Post a Comment