CSS Drop Down Menu

Monday, January 5, 2015

"రోజుకు నాలుగు కప్పుల "టీ" సేవిస్తే?


 ఆఫీసులో తూగుతున్నారా? అయితే వేడి వేడిగా ఓ గ్లాసుడు టీ తాగేస్తే.. నిద్రే కాదండీ.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అదేంటంటే... నిద్రను టీ తరిమికొడుతుందట.

ప్రపంచంలో ఎక్కడైనా సరే సాయంత్రం 4 గంటలైతే చాలు చురుగ్గా ఉండేందుకు ఓ టీ కప్పు చేతపట్టేస్తారు. ఇలా సాయంత్రం పూట ఒక గ్లాసుడు టీ సేవించేవారికి క్యాన్సర్ ముప్పు వుండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే టీ హృద్రోగ వ్యాధులను దరిచేరనీయకుండా గుండెను పదిలం చేస్తుంది.

చలికాలం, వేసవి కాలానికి తగ్గట్లు ఒక రోజుకు నాలుగు కప్పుల టీ సేవించే అలవాటున్న వారికి హృద్రోగ సమస్యలుండవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టీలోని పాలిపెనాల్స్ అనే కషాయం.. శరీరంలో క్యాన్సర్ కణాలను నశింపజేస్తుంది.

టీలోని ఫ్లావనాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండెపోటు, పక్షవాతంను దూరం చేస్తుంది. ఇక బ్లాక్ టీని తీసుకుంటే రక్త నాళాలు శుభ్రమవుతాయి. ఇక గ్రీన్ టీ, బ్లాక్ టీ సేవించే వారికి ఒబిసిటీ సమస్య ఉండదని, అల్లం, తులసీ కలుపుకుని టీ సేవిస్తే జలుబు వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

0 comments:

Post a Comment