వందేళ్లు బతకాలనుకునే ఆడవాళ్లు పురుషులతో శృంగారానికి దూరంగా ఉండాలని ఓ
బ్రిటన్ బామ్మ సలహా ఇస్తున్నారు. పురుషులకు దూరంగా ఉంటే సుధీర్ఘ కాలం
జీవించవచ్చని పేర్కొంటున్నారు. బ్రిటన్‌కు చెందిన 109ఏళ్ల బ్రహ్మచారిణి
జెస్సీ గల్లాన్... సుదీర్ఘకాలం జీవించాలనుకుంటే పురుషులకు (శృంగారానికి)
దూరంగా ఉండాలని మహిళలకు హితబోధ చేస్తున్నారు.
తాను సుదీర్ఘకాలం
ఆరోగ్యంతో ఉండటానికి కారణం పురుషులకు దూరంగా ఉండటం, గంజీ తాగడమేనని ఆమె
సీక్రెట్‌ను వెల్లడించారు. స్కాట్లాండ్‌లోని అబెర్డీన్‌లో జెస్సీ జనవరి 2న
తన 109వ జన్మదినాన్ని జరుపుకున్నారు. అంతేకాకుండా ఎక్కువకాలం బతకాలనుకునే
వాళ్లు గంజి తాగాలని సూచించారు.
ప్రతి రోజు ఉదయం వ్యాయామంతోపాటు, వెచ్చని గంజి తాగుతానని, పెళ్లి గురించి
ఎన్నడూ ఆలోచించలేదని ఆమె అన్నారు. పేదరికంతో పుట్టిన జెస్సీ 13 ఏళ్లేకే
ఇంటి నుంచి బయటకు వచ్చి పాలు సరఫరా చేస్తూ జీవితం గడిపారు.
ReplyDeleteఇంతా బతికి వల్ల కాటి లో చావడానికి ఆ మాత్రం బతకాలా మెతకాలా ! చోద్యం కాకుంటే మరి !