CSS Drop Down Menu

Monday, January 5, 2015

హాస్యనటుడికి "వార్నింగ్" ఇచ్చిన నయనతార ?


 దక్షిణాది బ్యూటీ నయనతార హాస్యనటుడిపై ఆవేశంతో అంతెత్తుకు ఎగిరిపడింది. దీనికి కారణం, ఆమెను ప్రేమ్ జీ 'ఆంటీ' అని సంబోధించడమే! వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్యా హీరోగా నటిస్తున్న 'మాస్' సినిమాలో నయన్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో వెంకట్ ప్రభు సోదరుడు, హాస్యనటుడు ప్రేమ్ జీ కూడా నటిస్తున్నాడు. షూటింగులో అతను అందర్నీ సరదాగా ఆటపట్టిస్తుంటాడు.

ఆ సమయంలో నయనతారను 'ఆంటీ...' అంటూ పిలుస్తూ జోకులేయడం మొదలెట్టాడు. అతని హాస్యాన్ని ఆమె కాస్సేపు సరదాగానే తీసుకుంది. అయితే, అతగాడి హాస్యం శ్రుతి మించడంతో నయనతారకు చిర్రెత్తింది. దీంతో సీరియస్ అయిందట.

"నన్ను ఆంటీ అంటావా? మరోసారి ఆ మాట అన్నావంటే నీ మర్యాద నీకు దక్కదు, జాగ్రత్త' అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట. ఆమె ఉగ్రరూపాన్ని చూసిన ఆ కమెడియన్ వెంటనే నోరుమూసేశాడట..! నయన్ పక్కకెళ్లాక ఆంటీ అంటే అంత కోపమా అనుకున్నాడ.

0 comments:

Post a Comment