శనిదోషం కారణంగా నానా అవస్థలు పడుతున్నారా? అయితే నల్లరాతితో చేయబడిన గణపతిని పూజించండి అంటున్నారు జ్యోతిష్య నిపుణులు. నల్లరాతితో మలచబడిన వినాయకుడిని ఆలయాల్లో గానీ, ఇంటనే గానీ పూజించడం ద్వారా శనిదోష ప్రభావం తగ్గుముఖం పడుతుందని, అనతి కాలంలోనే సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు అంటున్నారు.
ఒక్కో విధమైన శివలింగాన్ని అర్చించడం ద్వారా ఒక్కో విశేష ఫలితం లభిస్తుందన్న చందంగా గణపతిని వివిధ రూపాల్లో పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
గణపతిని పూజిస్తే ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. చిక్కుముడులన్నీ కూడా తేలికగా విడిపోయి ... సంతోషకరమైన జీవితం లభిస్తుంది.
శని గ్రహ సంబంధమైన దోషాల కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్ధికపరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆటంకాలు, అపజయాలు, వ్యసనాలకు బానిస కావడం వంటివి జరుగుతూ వుంటాయి.
ఈ విధమైన పరిస్థితుల్లో శనిదేవుడి అనుగ్రహం కోసం ఆయన క్షేత్రాలను దర్శించడం ... శాంతులు చేయించడం చేస్తుంటారు. అయితే నల్లరాతితో చేయించిన విఘ్నేశ్వరుడిని పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని, నవగ్రహ దోషాలు ఏమీ చేయలేవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
0 comments:
Post a Comment