CSS Drop Down Menu

Tuesday, September 9, 2014

"టచ్‌స్ర్కీన్‌" ను "క్లీన్" చేయటం ఏలా..?


టచ్‌స్ర్కీన్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలను ఉపయోగించే వారు తరచూ స్ర్కీన్ క్లీనింగ్ విషయంలో అప్రమత్తత పాటించాల్సి ఉంటుంది. లేకుంటే టచ్‌ స్ర్కీన్ మన్నికను కోల్పోయే ప్రమాదముంది. ఈ క్రింద   టచ్‌స్ర్కీన్‌ను క్లీనింగ్ విషయంలో పాటించాల్సిన అంశాలను ప్రస్తావించటం జరిగింది.
స్ర్కీన్‌ను శుభ్రం చేసేందుకు డిస్టిల్ వాటర్ లేదా వైట్ వెనిగార్‌ను ఉపయోగించండి. లేదా క్లీనింగ్ కిట్‌తో వచ్చిన సొల్యూషన్‌ను ఉపయోగించండి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మైక్రో ఫైబర్ క్లాత్‌ను మాత్రమే వాడండి.

మీ ఫోన్ టచ్‌స్ర్కీన్‌ను శుభ్రపరిచే క్రమంలో కఠినమైన రసాయనాలు ఇంకా ఆల్కాహాల్ ఆధారిత క్లీనర్లను ఉపయోగించొద్దు. స్ర్కీన్ క్లీనింగ్‌లో భాగంగా గరుకు బట్టలు, పేపర్ టవల్స్, టిష్యూ పేపర్స్ వంటి వాటిని ఉపయోగించకండి. వీటిని ఉపయోగించటం వల్ల స్ర్కీన్ పై గీతలు పడతాయి. స్ర్కీన్‌ను శుభ్రం చేసే క్రమంలో మీ చేతులతో స్ర్కీన్ పై బలంగా రాపిడి చేయవద్దు.

1 comment:

  1. మఖ్యంగా గ్లాస్ క్లీనింగ్ లిక్విడ్ వాడకూడదు. దాంట్లో అమ్మోనియా ఉంటుంది. అది మంచిది కాదు. లాస్ క్లీనింగ్ లిక్విడ్ వాడకూడదు టివీ‌ స్క్రీన్ క్లీన్ చేయటానికి కూడా. జాగ్రత.

    ReplyDelete