CSS Drop Down Menu

Friday, September 26, 2014

"ఆస్తి కొనేముందు తీసుకోవలసిన జాగ్రత్తలు"

ఇటీవల కాలంలో ఆస్తి అమ్మకాల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. ఒకే ఆస్తిని నకిలీ డాక్యుమెంట్లతో చాలా మందికి విక్రయిస్తూ ఉంటారు ఆస్తి దారులు. ఐతే  ఇలాంటి మోసాలకు గురి కాకుండా ముందుగానే ఆస్తి కొనేముందు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
 
డాక్యుమెంట్ ఒరిజనలేనా:- సాధారణంగా ఆస్తి చాలా చేతులు మారుతుంది. ఐతే ఈ ఆస్తికి మూలం ఎక్కడిది అనేది తెలుసుకోవాలి. అంతే కాదు మొదటి ఓనర్ తాలుకా అన్ని వివరాలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి.
 
చిక్కుముడులు:- హైద్రాబాద్ మహానగరంలో ఉన్న ఆస్తికి అక్కడి ప్రభుత్వ అనుమతులు అన్నీ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. ఉదాహారణకు హైదరాబాద్‌లో జీహెచ్‌ఎమ్‌సి నుంచి అన్ని అనుమతులు ఆ ఆస్తికి ఉన్నాయా లేదా పరిశీలించాలి.
 
ఓనర్లు నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్:- మీరు కొనుగోలు చేసే ఆస్తికి ఎక్కువ మంది ఓనర్లు ఉన్నట్లైతే వారి వద్ద నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పకుండా తీసుకోవాలి.
 
రుణభారం సర్టిఫికెట్:- రిజిస్టర్ ఆఫీస్ నుండి ముఖ్యంగా ఈ సర్టిఫికెట్ తీసుకోవాలి. దీని ఉపయోగం ఏమిటంటే మీరు కోనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి ఓనర్‌పై ఉందా లేదా అనేది తెలుస్తుంది.
పేరు:- ఎవరి వద్ద నుంచైతే మీరు ఆస్తి కొనుగోలు చేయాలనుకుంటారో వారి పేరు.. అందులో ఉందో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలి.
 
ట్యాక్స్ సకాలంలో చెల్లిస్తున్నాడా:- ఇండిపెండెంట్ హౌస్ ఉన్నట్లేతే అతను సకాలంలో ట్యాక్స్ చెల్లిస్తున్నాడా.. లేదా సరి సరిచూసుకోండి. మహా నగరాల్లో సకాలంలో ట్యాక్స్ చెల్లించకపోతే ఇల్లు మీ పేరు మీదకు బదిలీ అవదు.

సొసైటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్:- కొన్ని కొన్ని ఆస్తులకు సొసైటీ నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
 
మంచి లాయర్‌ను నియమించుకోండి:- లక్షల్లో డబ్బు పెట్టి ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు మంచి లాయర్‌ని కూడా సంప్రదించడం మంచి పద్దతి. ఎందుకంటే ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత ఏమైనా వివాదాలు వస్తే లాయర్ తప్పనిసరి కదా..


0 comments:

Post a Comment