ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి మీకు తెలుసా?ఖచ్చితంగా అనేక ప్రయోజనాలున్నాయి, ఉదయం చేసే జాగింగ్ కంటే ఎన్నో రెట్లు సెక్స్ ఉత్తమం అని అంటారు. ఎందుకంటే ప్రతి రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల హార్ట్ కు మరియు వ్యాధినిరోధకతకు చాలా మంచిది. అయితే మీరు అలసిపోయి ఇంటికి చేరుకుంటే?అందుకోసం ఒక చక్కటి చిట్కా ఉంది. నోటికి రుచికరంగా తియ్యని పదార్థాలు తినండి. ఇవి మీ స్టామినా అందిస్తాయి. అంతే కాదు, ఇవి మీరు రోజంతా కోల్పోయిన ఎనర్జీని తిరిగి పొందేలా చేస్తాయి. అప్పుడు సంతోషంగా మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనేలా హార్మోనులను ప్రేరేపిస్తాయి.
శృంగార క్రియకు ముందు పడుకొనే ముందు తీసుకొనే ఆహారాల్లో పచ్చికూరలు, చేదుగా, వగరుగా ఉండే కూరగాయలు తినడం కంటే, కొన్ని ఆరోగ్యకరమైన స్వీట్ ఫుడ్స్ తీసుకోవడం ఉత్తమం. స్వీట్ ఫుడ్స్ అంట్ నేచురల్ షుగర్ కలిగినటువంటి ఫిగ్స్ పండ్లు ఇవి మీలో స్టామినాను పెంచుతాయి. రాత్రుల్లో మీ భాగస్వామితో హాయిగా గడుపుతారు.
అలాగే సలాడ్స్ లో టమోటోల ముక్కలను జోడించి డిన్నర్ కు ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇటువంటి నేచురల్ స్వీట్ ఫుడ్స్ ను మీరు శృంగారంలో పాల్గొనడానికి ముందుగా తీసుకొన్నట్లైతే మిమ్మల్ని ఎనర్జిటిక్ గా మరియు ఫిట్ గా ఉంచుతుంది. అటువంటి స్వీట్ ఫుడ్స్ లిస్ట్ ను ఈక్రింది విధంగా లిస్ట్ అవుట్ చేసి అందివ్వడం జరిగింది. అయితే గుర్తుంచుకోవల్సి విషయం ఏంటంటే, ఈ ఫుడ్స్ తినడం వల్ల మీలో ఎనర్జీలు నింపడానికి మాత్రమే ఈ స్వీట్ ఫుడ్స్ సహాయపడుతాయిని గ్రహించాలి. కానీ, తక్షణమే ప్రభావం చూపుతాయని మాత్రం ఆశించ కండి. మరి స్వీట్ ఫుడ్స్ ఏంటో ఒక సారి చూద్దాం...
టమోటో:- రాత్రుల్తో మీరు తినే ఆహారాల్లో మరికొంత అదనంగా టమోటోలను జోడించండి. ఇది మీ ఫర్ఫెక్ట్ లవ్ మేకింగ్ నైట్ కోసం మీకు అవసరం అయ్యే స్టామినా అందిస్తుంది. టమోటోలో ఉండే లైకోపిన్ అనే అంశం సెక్స్ సామర్థ్యం ను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
బాదం మిల్క్:- బెడ్ మీదకు పోయే ముందు ఒక గ్లాస్ బాదం మిల్క్ త్రాగడం వల్ల మంచి ఎనర్జీని పొందవచ్చు. అది మీకు రాత్రి సమయంలో ఎంతో సహాయపడుతుంది.
ఫిగ్స్ :-ఇది ఒక ఫ్రూట్. ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉండి, లిబిడోను మెరుగుపరుస్తుంది . ఈ చిన్నఫ్రూట్ తినడం వల్ల వండర్ ఫుల్ అనుభవం ఉంటుంది.
డార్క్ చాక్లెట్ :- శృంగారంలో పాల్గొనడానికి ముందు చాక్లెట్ తినడం వల్ల మీ స్టామినా పెంచడంతో పాటు, ఇందులో ఉండే థియోబ్రొమైన్ అనే కంటెంట్ నేచురల్ ఎనర్జీని అందించి మంచి మూడ్ ను అందిస్తుంది.
అవొకాడో :- ఈ పండును టెస్టికల్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఈ హెల్తీ స్వీట్ ఫుడ్ శృంగారంలో పాల్గొనడానికి ముందు మీరు తీసుకొనే ఆహారంలో చేర్చుకోవాలి. అయితే పురుషులు మాత్రం పరిమితంగా తీసుకోవాలి. లేదంటే త్వరగా శీఘ్రస్ఖలం అయ్యే అవకాశం ఉంది.
తేనె :- తేనె మరో హెల్తీ స్వీట్ ఫుడ్. దీన్నిబెడ్ మీదకు చేరే ముందు తినవచ్చు . ఇందులో బిటమిన్ బి అధికంగా ఉండే టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి సహాయపడుతుంది . అలాగే స్టామినా పెంచే ఒక ఎనర్జెటిక్ ఫుడ్ ఇది. కాబట్టి మహిళల్లో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది.
క్యారెట్ :- స్టామినా పెంచడంలో అద్భుతమైన స్వీట్ ఫుడ్ క్యారెట్. క్యారెట్ ను పచ్చిగా లేదా ఉడికించి కూడా తీసుకోవచ్చు. ఇందులో చెప్పలేనన్ని విటమిన్స్ ఉన్నాయి. ఇవి మీలో తగినంత ఎనర్జీని అందిస్తాయి.
పుచ్చకాయ:- శృంగారంలో పాల్గొనడానికి ముందు ఒక పెద్ద బౌల్ల్ పుచ్చకాయ ముక్కలను తీసుకోవాలి . ఇందులో ఉండే సిట్రోలైన్ రక్తకణాలను తెరచుకొనేలా చేసి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది . ఇది క్రమంగా కామేచ్చను పెంచుతుంది.
దానిమ్మ :-శృంగారంలో పాల్గొనడానికి ముందు ఈ రెడ్ ఫ్రూట్ తీసుకోవడం చాలా మంచిది. ఇది జెనిటల్ ఆర్గాన్స్ కు రక్తప్రవాహాన్నిమెరుగుపరుస్తుంది.
0 comments:
Post a Comment