నోరూరించే నూడుల్స్ అందరికీ ఇష్టమే.. అయితే దీన్ని మరీ అతిగా తినడం వల్ల
ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయని ఓ స్టడీలో తేలింది. గుండె జబ్బులకు ఇది
కూడా కారణమవుతుందని పరిశోధకులు చెబుతున్నప్పటికీ దక్షిణ కొరియా, చైనా,
జపాన్ వంటి దేశాలలో నూడుల్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది.
ముఖ్యంగా సౌత్ కొరియావాసులు దీనిని ఎక్కువగా లాగించేస్తూ ఉంటారని, దీనివల్ల
వారిలో హార్ట్ సమస్యలు ఏర్పడుతున్నాయని అమెరికాలోని బేలర్ హార్ట్ అండ్
వాస్కులర్ ఆసుపత్రివర్గాల అధ్యయనంలో తెలియవచ్చింది. కానీ .. ఈ స్టడీని
వారు పట్టించుకోవడం లేదు. తాము ఇష్టంగా తినే నూడుల్స్ పై ఇలాంటి ప్రచారం
తగదని అంటున్నారు. నూడుల్స్ లో ఉండే సోడియం ఆరోగ్యానికి అంత మంచిది
కాదంటున్న ఈ అధ్యయనాన్ని వాళ్ళు తోసిపుచ్చుతున్నారు. పైగా దీన్ని సవాల్
చేస్తున్నారు. తాము వారానికి రెండు మూడు సార్లు దీనిని తింటున్నా తమకేమీ
అనారోగ్య సూచనలు కనబడడం లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. సౌత్ కొరియా తరువాత
చైనా, జపాన్ దేశాలు నూడుల్స్ వాడకంలో వరుసగా రెండు, మూడో స్థానాల్లో
ఉన్నాయి.
0 comments:
Post a Comment