CSS Drop Down Menu

Saturday, September 13, 2014

" దేవుళ్ళకీ ఆధార్ కార్డులు"


 చూడబోతే దేవుళ్ళకీ ఆధార్ కార్డులు జారీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఓ ప్రభుత్వ తీరు అలా ఉంది మరి.. రాజస్తాన్‌లోని సికార్ జిల్లాలో ఓ పోస్టాఫీసుకు ఇటీవల ఓ ఆధార్ కార్డు చేరింది. ఈ కార్డుతో కూడిన కవరు మీద అడ్రస్ సరిగా లేకపోవడంతో ..కవరు చించి చూసిన పోస్ట్‌మన్ నోరు వెళ్ళబెట్టాడు. ఆ కవర్‌లోని ఆధార్ కార్డు మీద హనుమంతుని ఫోటో ఉంది.

కార్డు యజమాని పేరును హనుమాన్‌జీ సన్ ఆఫ్ పవన్‌జీ అని కూడా ఉందట..బహుశా ఇది అచ్చు తప్పు అయిఉంటుందని భావించిన పోస్టల్ సిబ్బంది ఆ హనుమాన్‌జీ ఎవరో కనుక్కునేందుకు యత్నించి విఫలమయ్యారు. కాగా.. ఈ కార్డు మీద ముద్రించి ఉన్న నెంబరు అంకిత్ అనే వ్యక్తిదట...ఆధార్ కార్డులు జారీ చేసే ఓ సంస్థలో ఇతడు  పని చేస్తున్నాడు. ఈ కార్డు విషయం మొత్తానికి అతనికి చేరింది. దీనిమీద తన నెంబరు ఎలా ప్రింట్ అయిందో తెలియదని అంకిత్ అంటున్నాడు. ఏమైనా ఈ ఆధార్ కార్డు యవ్వారం అక్కడ అందరినీ నవ్వించింది. బహుశా అంకిత్ ఫోటో బదులు పొరబాటున ఆంజనేయుని ఫోటోను ముద్రించి ఉండవచ్చునని భావిస్తున్నారు. 



0 comments:

Post a Comment