కిడ్నీ సంబంధిత రోగాలకు క్యాలీఫ్లవర్ దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి, పీచు అధికంగా ఉండటంతో కిడ్నీ రోగాలు దరిచేరవు. యూరినరీ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే వారానికి రెండు లేదా మూడు సార్లు క్యాలీఫ్లవర్‌ను డైట్‌లో చేర్చుకోవాల్సిందేనని వారు సూచిస్తున్నారు.
కిడ్నీ రోగాలతో రక్తహీనత ఏర్పడుతుంది.
శరీరంలోని మలినాలను యూరిన్ ద్వారా వెలివేసే కిడ్నీని ఆరోగ్యంగా
ఉంచుకోవాలంటే క్యాలీఫ్లవర్‌ను తీసుకోవాలి. అలాకాకుంటే శరీరంలో బ్లడ్ సెల్స్
లెవల్స్ తగ్గిపోయి రక్తహీనత ఏర్పడుతుంది.
తద్వారా నీరసం, అలసట ఆవహిస్తుంది. ఇలాంటి
సమస్యలు దూరం కావాలంటే క్యాలీఫ్లవర్‌ను ఉడికించి కూరల్లో తీసుకోవడం సలాడ్స్
రూపంలో తీసుకోవడం ఉత్తమమని న్యూట్రీషన్లు అంటున్నారు.
మొలకెత్తిన విత్తనాలను కూడా ఆహారంగా
తీసుకోవడం ద్వారా కిడ్నీ సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చు. ఇవి కిడ్నీలో
రాళ్లు రానీయకుండా నిరోధిస్తాయి. అలాగే కిడ్నీ రోగాలను నయం చేసుకునేందుకు
క్యాలీఫ్లవర్, మొలకెత్తిన ధాన్యాలతో పాటు ఆపిల్, ఎరుపు ద్రాక్షలు, చెర్రీ
ఫ్రూట్స్, కోడిగుడ్డులోని తెల్లసొన తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు
అంటున్నారు.
0 comments:
Post a Comment