వాషింగ్టన్: మగవారిని ఆకర్షించేందుకు ఓ మహిళ మూడో వక్షోజాన్ని ఆపరేషన్ ద్వారా పొందింది. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది. మన దేశంలో ఇటీవల క్లీవేజ్ గురించిన చర్చ జోరుగా సాగుతోన్న విషయం తెలిసిందే. హీరోయిన్ దీపికా పదుకొణే తన వక్షోజాల గురించి మాట్లాడి సంచలనం సృష్టించారు. తాను మహిళనని, వక్షోజాలు ఉంటాయన్న ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఇదిలా
ఉండగా.. ఫ్లోరిడాలో ఓ యువతి మగవారిని ఆకర్షించేందుకు మూడో వక్షోజాన్ని
పొందాలనుకోవడం గమనార్హం. అయితే, తనకు ఎవరితోను డేటింగ్ చేయాలనే ఆసక్తి
లేదని చెబుతోంది.
ఫ్లోరిడాకు చెందిన జాస్మిన్ అనే 21 ఏళ్ల యువతి
ఆపరేషన్ ద్వారా తన రెండు వక్షోజాల మధ్య మూడో వక్షోజాన్ని పొందింది. తాను ఈ
మూడో వక్షోజాన్ని ఆపరేషన్ ద్వారా పొందేందుకు భారీగా ఖర్చయినట్లు చెప్పింది.
కాగా, ఈ ఇరవై ఒక్కటేళ్ల యువతి మసాజ్ థెరపిస్ట్. ఆమె యాభై మంది డాక్టర్లను
అప్రోచ్ అయి దీని గురించి తెలుసుకున్నారట.
ఈమె నాన్ డిస్ క్లోజర్ అగ్రిమెంట్ పైన సంతకం చేసింది. దీంతో తాను మూడో
వక్షోజం పొందేందుకు ఆపరేషన్ చేసిన వైద్యుల పేర్లను ఆమె వెల్లడించడం లేదు. ఈ
సర్జరీని పలువురు తప్పు పట్టారు. ఈ ఆపరేషన్ చేసిన వైద్యులు
వృత్తిధర్మాన్ని పక్కన పెట్టారని పలువురు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా,
సదరు యువతి ఇప్పుడు ఆందోళనతో ఉందట. అయితే, ఆమె ఇప్పటి వరకు ఫిర్యాదు
చేయలేదు.
0 comments:
Post a Comment