డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఏది మాట్లాడినా సెన్సేషన్‌గానే మారుతోంది. ఎప్పుడూ దేవుడు కంటే దెయ్యాలే మంచివని వాదించే ఈ దర్శకుడు, ప్రస్తుతం ఆస్తికుడిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వున్నట్లుండి ఇతనిలో ఈ మార్పు ఏంటా అని అనుకుంటున్నారా..? తన సినిమాలు వరసగా ప్లాప్ కావడానికి దేవుళ్లను దూషించడమే కారణమంటూ మనసులోని మాట బయటపెట్టేశాడు. అందుకే తాను భక్తుడిగా మారుతానంటూ ట్వీట్ చేశాడు.
దేవుడు మంచివాడైతే మెదక్‌లో జరిగిన రైల్వే గేట్ ప్రమాదంలో చిన్నారులను ఎందుకు పొట్టన పెట్టుకుంటాడు అంటూ గతంలో వర్మ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! ఇంతలోనే మార్పు ఎలా సాధ్యమంటూ మరికొందరు చర్చించుకుంటున్నారు. అంటే తన సినిమాలు హిట్ కావాలని ఒక విధంగా దేవుణ్ని ప్రార్థించడమేకదా అంటూ ఇండస్ర్టీలో సెటైర్లు వినిపిస్తున్నాయి.
0 comments:
Post a Comment