న్యూస్ ఛానల్ యాంకర్లు న్యూస్‌లు ఎలా
చదువుతారు... ఇదేం ప్రశ్న అని తలబద్దలు కొట్టుకోకండి! అసలు విషయం ఏంటంటే మన దేశంలో న్యూస్ చదివే యాంకర్లు పద్ధతిగా చీర కట్టుకుని చదువుతుంటారు.
అదే అల్బానియా దేశంలో మాత్రం న్యూస్ రీడర్లు టాప్‌లెస్‌గా వార్తలు
చదువుతారు. వివరాల్లోకి వెళితే.. ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాలలో పోటీ
ఖచ్చితంగా ఉంటుంది. అలాగే న్యూస్ ఛానల్‌లో కూడా ఆ పోటీ తప్పకుండా ఉంటుంది.
అయితే అల్బానియాలో అయితే న్యూస్ ఛానల్ మధ్య
పోటీ విపరీతంగా ఉంటుందట. అందుకే ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చెయ్యడానికి ఫైర్
టీవీ న్యూస్ ఛానల్ వార్తలని టాప్ లెస్ యాంకర్లతో చదివిస్తుంది. దీనికి
'నేకడ్ ట్రూత్' అని కాప్షన్ కూడా పెట్టారు. అంటే న్యూస్ రీడర్లు బ్రా, టాప్
లేవీ ధరించకుండా వార్తలు చదువుతారు. అయితే పైవి పూర్తిగా కనబడకుండా ఓపెన్
బ్లేజర్, కోటు వంటివి ధరిస్తుంటారు. ఇలా వార్తలు చదివే అమ్మాయిలనే ఈ న్యూస్
ఛానల్ ఎక్కువ శాతంలో సపోర్ట్ చేస్తుందట.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... మొదట
వార్తలను టాప్ లెస్‌గా చదివించాలని ఆ న్యూస్ ఛానల్ భావించిందట, కానీ
అల్బానియా సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఆ సాహసం చెయ్యలేకపోయిందట. నిజానికి ఈ
ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఈ పోటీ ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేక
ముద్రవేసుకోవాలని, అంతేకాకుండా న్యూస్ చూస్తున్నంతసేపు వీక్షకులను తమ
న్యూస్‌తో కట్టిపడేయాలని ఈ న్యూడ్ కాన్సెప్ట్‌ని చేపట్టింది. అయితే ఈ
ఛానల్‌లో టాప్‌లెస్‌గా వార్తలు చదువుతున్న హోగ్జాగ్ అనే యాంకర్ మంచి
పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె వారానికి సుమారు 2 లక్షల 25 వేల రూపాయల
పారితోషికం తీసుకుంటుందంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ..!
0 comments:
Post a Comment