సాధారణంగా మనుషులు హత్యలు చేస్తుంటారు. వీరికే భారత శిక్షా స్మృతి చట్టం
కింద శిక్షలు వేసి వాటిని అమలు చేస్తుంటారు. కానీ, గుజరాత్‌లో ఓ విచిత్రం
జరిగింది. ముగ్గురిని హత్య చేసిన కేసులో 18 సింహాలను అటవీశాఖ అధికారులు
అదుపులోకి తీసుకున్నారు. వీటిలో హత్య చేసిన సింహాన్ని గుర్తించి.. దానికి
శిక్ష వేయనున్నారు.
దీని పై గుజరాత్ అటవీశాఖ అధికారులు స్పందిస్తూ... ముగ్గురు పర్యాటకులను హత్య చేసిన కేసులో 18 సింహాలను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. ఇందులో నేరం చేసింది ఒక్కటే. ఆ సింహాన్ని గుర్తించి జూలో జీవితఖైదు శిక్ష విధిస్తామని తెలిపారు. హత్యా స్థలంలో దొరికిన పంజా గుర్తుల ఆధారంగా ఆ సింహాన్ని గుర్తించనున్నట్టు తెలిపారు.

నేరం చేసిన దానిని జూకి తరలించి, మిగతా
వాటిని గిర్ అభయారణ్యంలో వదిలేస్తామని తెలిపారు. గుజరాత్‌లో 400
వరకు ఆసియా సింహాలు ఉన్నాయి. అయితే గిర్ అభయారణ్యంలో మాత్రం 270 వరకే
ఆశ్రయం కల్పించగలమని అక్కడి అధికారులు అంటున్నారు. దీంతో మిగతా
సింహాలు ఇలా ఊళ్లపైకి వెళ్లకుండా వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించాలని
ఈమధ్యే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీచేసింది.
0 comments:
Post a Comment