ఒకటి రెండు కుక్కలను సాకాలంటేనే ఎంతో ధనవంతులైతే
మినహా ఆ సాహసం చేయరు. ఆ సాదు జీవులపై ప్రేమ ఉండాలేగాని.. డబ్బుదేముంది
అంటోంది ఢిల్లీ నగరానికి చెందిన ప్రతిమాదేవి.
ఆమె చుట్టూ సుమారు 400 కుక్కలు.. వాటికి మూడు పూటలా కడుపు
నిండా తిండి పెట్టి.. వాటి ఆలనాపాలన చూస్తుంది. ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర
వస్తువులు పోగు చేసి అమ్మి రోజుకు రూ. 150 సంపాదిస్తుంది ప్రతిమాదేవీ.
వచ్చిన డబ్బుతో వీధి కుక్కలన్నింటికీ ఉదయం 6 గంటలకు పాలు, బిస్కెట్స్,
మధ్యాహ్నం 12 గంటలకు ఆహారంతో పాటు పాలు, రాత్రి 11 గంటలకు భోజనం
సమకూరుస్తుంది. ఇక రాత్రి పూట ఆమె నివాసంలో ఉండకపోతే కుక్కలు కూడా నిద్ర
పోవట. ఆమె లేకుండా కూడా భోజనం చేయవట. కుక్కలకున్న విశ్వాసం అది అన్న మాట. కుక్కల ఆలనాపాలనకు ప్రతిమా దేవీ తన జీవితాన్ని ధారపోస్తుంది.
ప్రతిమాదేవీకి
వివేక్(18) అనే అబ్బాయి చేదోడువాదోడుగా ఉంటూ కుక్కలను బాధ్యతగా
చూసుకుంటాడు. తన భర్త వద్ద లేని సంతోషం కుక్కలతో ఉంటే వస్తుందని చిరునవ్వు
నవ్వుతూ చెబుతుంది ప్రతిమా దేవీ. ఆ వీడియో సోషల్ మీడియాకు ఎక్కడంతో
ప్రతిమాదేవిపై ప్రశంసల వెల్లువెత్తున్నాయి.
మీరూ ఈ వీడియో చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి చూడండి .
0 comments:
Post a Comment