ఆ రెస్టారెంట్‌లోకి
వెళ్లటానికి కస్టమర్స్ కుతూహలం చూపిస్తారు. ఆలస్యమైనా ఫర్వాలేదని
రెస్టారెంట్ ముందు జనాలు క్యూ కడతారు. ఎందుకంటే అక్కడ వెయిటర్స్‌గా కోతులు
పని చేస్తాయి. అడిగిందే తడవు చిత్తం కస్టమరూ అన్నట్లు ఆర్డర్‌ను
తీసుకొస్తాయి. అక్కడ తినేవారికి వినోదం మినిమమ్ గ్యారెంటీ. జపాన్‌లో ఉండే ఈ
మంకీస్ రెస్టారెంట్ విశేషాల్ని తెల్సుకుందామా.
- జపాన్‌లోని టోక్యోనగరంలో ఉండే కయాబుకియా టావెర్న్ రెస్టారెంట్‌లో మంకీ వెయిటర్స్ ఉన్నాయి.
- ఈ రెస్టారెంట్‌లో యట్ చాన్, ఫకు చాన్ అనే రెండు కోతులు పని చేస్తున్నాయి. యజమాని పేరు కవోరు వస్తుకా.
- రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టేవారికి సాదరంగా కోతులు స్వాగతం పలుకుతాయి. ఎవరైనా కస్టమర్ ఆశ్చర్యపోయి ఆ కోతుల వైపు ఆసక్తిగా చూస్తే బాల్‌మీద నడవటం, ఫోజులు కొట్టడం.. చేస్తూ ఆతిథ్యంలోనే కాస్త వెరైటీ ఫన్‌ను ఇస్తాయి.
- ఈ రెండు కోతులకూ రెస్టారెంట్ యజమాని మాస్కులు వేయిస్తాడు. ఒక్కో రోజు ఒక్కో గెట్‌పలో ప్రత్యక్షమవుతాయి.
- టై కట్టుకని వెయిటర్ జాబ్‌ను పక్కాగా నిర్వర్తిస్తాయి.
- యట్ చాన్ రెస్టారెంట్‌లోని టేబుల్ మధ్య చకచకా పరుగెడుతుంది. కస్టమర్స్ అడిగిన ఫుడ్‌తో పాటు బీర్, ఇతర డ్రింక్‌లను స్పీడ్‌గా సప్లై చేస్తుంది.
- కస్టమర్స్ తినటం అయిపోయాక చేతులు శుభ్రపరచుకోవటానికి హాట్ టవల్‌ను తీసుకొచ్చి మరీ ఇస్తుంది ఫకు చాన్. దాని హాస్పిటాలిటీ చూస్తే ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే.
- రెస్టారెంట్‌లో ఉండే ఈ జంట వెయిటర్స్‌ను చూడటానికే ఎక్కువ మంది వస్తుంటారు. ఇతర దేశాలవారూ తెల్సుకుని మరీ ఆ రెస్టారెంట్‌లోకి వెళ్తుంటారు. వీలైతే రెండు సెల్ఫీలు, నాలుగుఫోజులు కొడతాయి ఈ మంకీ వెయిటర్స్.
- యాన్ అనే 62 ఏళ్ల రెగ్యులర్ కస్టమర్ ‘నా పిల్లలు నేను చెప్పిన మాట వినరు, ఈ కోతులు భలే వింటాయి. కొందరి మనుషుల కంటే ఇవి చాలా నయం’ అంటూ మురిసిపోతాడు.
- ఈ వెయిటర్స్‌కు టిప్‌గా పండ్లు, సోయా బీన్స్ ఎక్కువగా కస్టమర్స్ ఇస్తుంటారు. ఎందుకంటే వాటికి సోయాబీన్స్ అంటే చాలా ఇష్టం.
- మొత్తానికి కోతులే వెయిటర్స్‌గా ఉండటం అద్భుతమైన మార్కెటింగ్ సా్ట్రటజీ అని నిపుణులు అంటున్నారు. ఆ కోతులవల్లే కయాబుకియా రెస్టారెంట్ వ్యాపారం వర్ధిల్లుతోంది.
- యజమాని కవోరు వస్తుకా ఓ రోజు రెస్టారెంట్‌లో పని చేస్తుంటే తన పెంపుడు కోతులు అనుకరించాయట. అందుకే వాటిని వెయిటర్స్‌గా తీసుకోవాలనే ఆలోచన ఆయనకు వచ్చిందట.
- ‘ఏప్స్‌తో మాత్రమే రెస్టారెంట్స్‌లో రోజుకు కేవలం రెండు గంటలు పని చేయించుకోవచ్చు’ అని జపాన్‌లోని జంతువుల చట్టం చెబుతోంది. అయితే ఈ రెండు కోతులకు మినహాయింపు. లోకల్‌గా ఉండే అధికారులు వీటి పనిని చూసి పర్మిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు.
- చాన్ జోడీ తర్వాత వాటికి పుట్టిన మూడు పిల్లకోతులు ఆ రెస్టారెంట్‌లో వెయిటర్స్‌గా పనిచేస్తాయట. ఇందుకోసం ట్రైనింగ్ అవుతున్నాయి కూడా.
ఈ వీడియో గాని చూడాలనుకొంటే ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి .
https://youtu.be/CcPDEtSRYXA
https://youtu.be/CcPDEtSRYXA
0 comments:
Post a Comment