అసెఫీటిడా
అంటే ఏంటి? అని ఎవరన్నా అడిగితే కాసేపు ఆలోచించాల్సి ఉంటుంది. అదే ఇంగువ
అనో హింగ్ అనో చెబితే మన రోజువారీ వంటకాల్లో ఉపయోగించే పదార్థం
గుర్తుకువస్తుంది. ఫెరూలా అనే వృక్షజాతి నుంచి సేకరించిన పాలతో రూపొందించే
ఇంగువని విడిగా తినడం కష్టమే. కానీ అదే ఇంగువని వంటల్లో వేసుకుంటే వచ్చే
రుచీ, పరిమళం వేరు. భారతీయుల వంటకాల్లో, మరీ ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో
ఇంగువ లేకుండా పని జరగదు. వెల్లుల్లి, ఉల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉండే
సనాతనవాదులు సైతం... వాటికి బదులుగా ఇంగువని చిలకరించి వంటకాల్లో అనూహ్యమైన
రుచిని సాధిస్తుంటారు. మరి వందల సంవత్సరాలుగా మన వంటకాల్లో చేరిపోయిన ఈ
ఇంగువను కేవలం రుచి, పరిమళానికేనా... లేదా మరేదన్నా ఆరోగ్యపరమైన కారణంతో
వాడుతుంటారా? అంటే జవాబులు ఇవిగో...
- చాలామందికి ఆహారం తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా మారిపోతుంది. ఇలాంటి ఉబ్బరాన్ని శుబ్బరంగా తగ్గిస్తుంది ఇంగువ. ఇలా కడుపు ఉబ్బరాన్ని తగ్గించే పదార్థాలని యాంటీ ఫ్లాట్యులెంట్స్ అంటారు. ఇంగువ అలాంటి యాంటీ ఫ్లాట్యులెంట్స్‌లో ఒకటి.
- చాలామందికి ఆహారం తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా మారిపోతుంది. ఇలాంటి ఉబ్బరాన్ని శుబ్బరంగా తగ్గిస్తుంది ఇంగువ. ఇలా కడుపు ఉబ్బరాన్ని తగ్గించే పదార్థాలని యాంటీ ఫ్లాట్యులెంట్స్ అంటారు. ఇంగువ అలాంటి యాంటీ ఫ్లాట్యులెంట్స్‌లో ఒకటి.
- కేవలం కడుపు
ఉబ్బరాన్నే కాదు! జీర్ణసంబంధమైన సమస్యలెన్నింటిలోనో ఇంగువ అమోఘంగా
పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం పిత్తదోష కారణంగా ఏర్పడే అరుచి, అజీర్ణం,
ఆకలి లేకపోవడం లేకపోవడం వంటి సమస్యలకు ఇంగువ దివ్యౌషధం. ఆఖరికి కడుపు లోపల
అయిన గాయాలను మాన్పే శక్తి కూడా ఇంగువకు ఉందని పరిశోధనల్లో తేలింది.
- అటు
ఆయుర్వేదంలోనే కాకుండా ఇటు యునానీలో కూడా ఇంగువ ప్రాధాన్యత అంతాఇంతా కాదు.
ముఖ్యంగా ఫిట్స్ వంటి మానసిక సంబంధమైన వ్యాధులకు మందుగా యునానీ వైద్యులు
ఇంగువను వాడుతుంటారు.
- ఆడవారిలో
రుతుసంబంధమైన సమస్యలకు ఇంగువ విరుగుడుగా పనిచేస్తుందని నమ్ముతారు.
రుతుచక్రం సరిగా లేకపోవడం, రుతుక్రమ సమయంలో కడుపునొప్పి వంటి ఇబ్బందులను
ఇంగువ సరిచేస్తుంది. అందుకే కొంతమంది బాలింతలకు ఇంగువను ఇస్తుంటారు.
- ఇంగువ ఇటు
పొడిదగ్గు, అటు కఫంతో వచ్చే దగ్గలకు ఉపశమనంగా నిలుస్తుంది. ఆస్తమా,
బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులలోనూ ఉపయుక్తంగా ఉంటుంది. ఇక
తీవ్ర పడిశాన్ని (Influenza) కలిగించే H1N1 అనే వైరస్‌ను ఇంగువ సమర్థవంతంగా
ఎదుర్కొంటుందని తేలింది.
- ఇప్పుడు ఏ
ఇంట్లో చూసినా షుగర్ వ్యాధి బాధలు కనిపిస్తున్నాయి. ఈ చక్కెర వ్యాధిని
అదుపుచేయడంలో ఇంగువ తనదైన పాత్రను పోషించగలదంటున్నారు. ఇన్సులిన్
ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంగువ, రక్తంలో చక్కెర నిల్వలని అదుపు చేస్తుందని
చెబుతున్నారు.
- ఇంగువలో
coumarin అనే రసాయనాలు ఉన్నాయట. ఈ కౌమరిన్‌లకు రక్తాన్ని పలచన చేసే ప్రభావం
ఉంటుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టి గుండెపోటుకి దారితీసే పరిస్థితి నుంచి
బయటపడవచ్చు. రక్తంలో కొలెస్టరాల్ పేరుకోకుండా నివారించవచ్చు.
- ఇంగువకి
ఒంటి నొప్పులను నివారించే గుణం ఉందంటున్నారు. ముఖ్యంగా ఓ పట్టాన మందులకు
లొంగని మైగ్రెయిన్ తలనొప్పులు, రుతుక్రమంతో పాటు వచ్చే కడుపునొప్పులను ఇది
హరిస్తుంది.
చెప్పుకొంటూ
పోవాలే కానీ ఇంగువ ఇచ్చే అద్భుత ఫలితాల జాబితా చాంతాడంత ఉంటుంది. అందుకే
దీనిని ఆయుర్వేదం, హోమియోపతి, యునాని వంటి అన్ని సంప్రదాయ వైద్యాలలోనూ
వాడుతుంటారు. ఇంగువని మన వంటకాల్లో చేర్చడం వల్ల పైన పేర్కొన్న లాభాలన్నీ
ఎంతో కొంత కలుగుతూనే ఉంటాయి. అలా కాకుండా చిటికెడంత ఇంగువని గోరువెచ్చటి
నీళ్లలోనో, మజ్జిగలోనో తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. ఇంగువను ప్రత్యేకించి
ఒక ఔషధిగా తీసుకోవాలంటే మాత్రం ఎవరన్నా తెలిసిన ఆయుర్వేద వైద్యుని
సంప్రదించడం మంచిది.
0 comments:
Post a Comment