పెళ్ళిళ్ళు యుక్త వయస్సులో ఉన్నవారికేనా..? మేమూ పెళ్లి చేసుకుంటున్నాం
అంటున్నారు సీనియర్ సిటిజెన్స్. భార్యను కోల్పోయి.. 60 లేదా అంతకన్నా
ఎక్కువ వయస్సు ఉన్న వృధ్దులో. లేక భర్తలను కోల్పోయి ఒంటరి జీవితం
అనుభవిస్తున్న వయస్సు మళ్ళిన మహిళలో తోడూ కోసం పరితపిస్తున్నారు. గతంలో
కన్నా ఇప్పుడీ ట్రెండ్ పెరిగిందని తోడు నీడ స్వచ్చంద సంస్థ నిర్వాహకులు
చెబుతున్నారు.
ఒంటరితనాన్ని భరించలేక వీరంతా సరికొత్త జీవితం ఆరంభిస్తున్నారు. పెళ్లి
లేదా సహజీవనం చేస్తే తప్పేమిటని వీరంతా ప్రశ్నిస్తున్నారు. తమ కూతుళ్ళు
లేదా కొడుకులు నిరాదరిస్తున్న కారణంగా ఇలాంటి వాళ్ళంతా మేమూ పెళ్లి
చేసుకుని ఒకరి కష్ట సుఖాలు మరొకరు చెప్పుకుంటూ ఊరట చెందుతున్నామని ఈ
వృద్ధులు అంటున్నారు. సమాజంలో ఈ పోకడ ఇదివరకటికన్నా ఎక్కువయిందని ఈ
స్వచ్చంద సంస్థ నిర్వాహకులు అంటున్నారు.
0 comments:
Post a Comment