మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా.. ? పోనీ రాశులు? తిధులు, నక్షత్రాలూ…?
ఇవన్నీ పక్కన పెట్టండి…. లాస్ట్ కి న్యూమరాలజీనైనా నమ్ముతారా… నమ్మితే
కింద మీ జాతకాన్ని చూసుకోండి, నమ్మకపోయిన కింద ఉన్న మీ జాతకాన్ని చూసుకొని
ఇలాగే జరిగిందా..? లేదా…? అని ఓ సారి మీ జ్ఞాపకాలను నెమరేసుకోండి. ఇప్పుడు
చాలామంది చైనా న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు. ఓ సారి మీరు కూడా ట్రై
చేయండి, మన పేరు ఆధారం చేసుకొని మన వ్యక్తిత్వం, మన ఆలోచనల విధానాన్ని ఈ
అంకెల ద్వారా అంచనావేసి చెబుతారట. ( షరతులు వర్తిస్తాయ్).
ఉదాహరణకు:
అనిల్ (ANIL) అనే వ్యక్తి పేరును ఉపయోగించి అతడి వ్యక్తిత్వం ఎలాంటిదో న్యూమరాలజీ ప్రకారం పరీక్ష చేద్దాం.
A=1, N=5, I=1, L=3 . వీటి మొత్తం కలపండి. 1+5+1+3=10.
మీకు మొత్తం రెండంకెల సంఖ్య వస్తే వాటిని రెండుగా వేరు చేసి కలపండి.
10= 1+0= 1. ఇప్పుడు ‘1’ అంకె ప్రకారం ఎలా ఉందో టెస్ట్ చేద్దాం.
1. మీరు ఎంతో ధైర్యం కలవారు. మీకు ఎదురయ్యే దారిలో ఎలాంటి సమస్యలు ఎదురైనా
సరే వాటిని ప్రతిష్టాత్మకంగా భావించి ఎదుర్కోగల సత్తా మీ సొంతం. ఎంతో
నమ్మకంతో ఆ సమస్యలకు ఎదురెళ్ళి విజయం సాధిస్తారు.
2. ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. సొంత విశ్వాసం చాలా తక్కువ.
దానివల్ల వ్యక్తిగతంగానే కాకుండా ఇతర కారణాల వల్లా సమస్యల్లో పడతారు.
3. ఎలాంటి పనైనా సరే కష్టపడి సాధిస్తారు. మీకున్న తెలివితేటల వల్ల ఇతరుల
కంటే ముందుగా ఆ పనిని పూర్తిచేసి ముందుకు సాగుతూ, ప్రత్యేక గుర్తింపు
పొందుతారు.
4. తొందరగా ఎవరితోనూ కలవలేరు, మాటలు కలుపలేరు. ఒకసారి వారు మీకు దగ్గరైన తర్వాత వారికోసం ఏం చేయడానికైనా సరే ఆలోచించరు.
5. చాలా తెలివైనవారు, చేయాల్సిన పనిని ఎప్పుడు చేయాలో వెంటనే
పూర్తిచేస్తారు, ఎలాంటి వాయిదా వేయకుండా తక్కువ టైంలో పూర్తిచేసి రిలాక్స్
గా ఉంటారు.
6. మీతో పాటు మీ చుట్టూ ఉండేవారు గౌరవంగా ఉండేలా ఆదేశాలిస్తారు. అలాంటి
సమయంలో మీరు మిమ్మల్ని నియత్రించుకోలేరు. మీ జీవితంలో అనవసరమైన దుబారా
ఖర్చులకు చాలా దూరంగా ఉంటారు.
7. మీరు కొత్తదనాన్ని స్వాగతిస్తారు. మీకే తెలియని ఓ క్రియేటర్ మీలో
ఉన్నాడు. కళలంటే మీకు చాలా ఆసక్తి. పాత పద్ధతులను అనుసరించడానికి ఇష్టపడరు.
8. మీకు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. వాటి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. బంధాలు, బాధ్యతలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు.
9. ఈ నెంబర్ వచ్చినవారికి ఉన్నట్లుండి కోపం వస్తుంది, ఆ తర్వాతే వెంటనే
కూల్ అయ్యి, మాములుగా అందరితో కలిసిపోతారు. ఎలాంటి పనైనా సరే అది
పూర్తయ్యేవరకూ వదిలిపెట్టరు.
అయితే ఇంకెందుకు ఆలస్యం మీ సంఖ్యాబలం ఎలా ఉందో మీరూ తెలుసుకోండి.
0 comments:
Post a Comment