ఆ సముద్ర తీరంలో తవ్వితే పొగలొస్తాయి. అక్కడి నీళ్లు సలసలమని కాగుతుంటాయి. విచిత్రంగా ఉంది కదూ.
* ‘హాట్ వాటర్ బీచ్’గా పిలిచే ఇది. న్యూజిలాండ్‌లోని కోరమాండల్ ద్వీపకల్పపు తూర్పు తీరంలో ఉంది.
* తీరంలో ఇసుక నుంచి బుసబుస మంటూ వేడి నీటి బుడగలు వస్తుంటాయి. పర్యటకులు పారలతో వచ్చి తవ్వడం మొదలుపెడతారు. ఎవరికి వారే మడుగులు తయారు చేసుకుని పొగలు కక్కే వేడి నీళ్లలో జలకాలాటలు ఆడుకుంటారు. ఇసుకని తీస్తూ గుండ్రని మడుగులుగా చేసుకుని ‘స్పా పూల్స్’గా మార్చుకుంటారు.

* ఈ నీటి ఉష్ణోగ్రత 64 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుందిట.
* ఒక వైపు కెరటాలు ఎగసిపడుతుంటే మరో వైపు తీరంలోని ఈ మడుగులో పడుకుని హాయిగా సేదతీరుతారు. మరి అంత వెచ్చని నీళ్లు అయితే బొబ్బలు రావా? అందుకే కొంతమంది ఎగసివస్తున్న అలల చల్లటి నీటిని మడుగుల్లో కలుపుకుంటారు.
* ఈ తీరంలో ఇసుక కింద వేడి నీటి బుగ్గలుండటం వల్లే ఇలా వేడి నీళ్లు వస్తున్నాయి.
* ఇక్కడికి ఏటా దాదాపు ఏడు లక్షల మంది పర్యటకులు వస్తారు.
0 comments:
Post a Comment