
మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన
తరువాత క్షత్రియ ధర్మం ప్రకారం అశ్వమేధయాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు
పాండవులు. పాండవులు వదిలిన యాగాశ్వాన్ని ఆపే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు.
ఒకరిద్దరు ధైర్యం చేసినా, పాండవులతో యుద్ధం చేసి నిలువలేకపోయారు. అలా ఒకో
రాజ్యమూ పాండవుల పాదాక్రాంతమవుతూ వచ్చింది. ఇంతలో యాగాశ్వం మణిపుర
రాజ్యాన్ని చేరుకుంది. ఆ రాజ్యాన్ని పాలిస్తున్నవాడు శ్రీకృష్ణుని
పరమభక్తుడైన మయూరధ్వజుడనే రాజు. అపర పరాక్రమవంతుడైన ఆ మయూరధ్వజుని...