CSS Drop Down Menu

Saturday, May 7, 2016

"ఆచారం దెబ్బ"కు బెంబేలెత్తుతున్న కొత్త జంటలు !

ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ వాసులకి కొన్ని విచిత్రమైన ఆచారాలుంటాయి. అలాంటి ఆచారమే స్వీడన్‌లోనూ ఉంది. దీనిగురించి తెలిస్తే ఖంగుతినాల్సిందే. పూర్తి వివరాలను పరిశీలిస్తే.. స్వీడన్‌లో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలోని వధువైన, వరుడైన ఒంటరిగా కనిపిస్తే ఇతరులు వచ్చి వారితో అదరచుంబనం చేస్తారట. వరుడు ఒంటరిగా దొరికినా ఇదే తంతు. ఇక వధువు ఒంటరిగా దొరికినా ముద్దుల్లో వర్షాల్లో తడిసిముద్దయిపోవాల్సిందే. ఇది  కేవలం పెళ్లి రోజుకే పరిమితం. 
 
ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు తమ ఎదురుగా ఇతరులు ముద్దు పెట్టుకుంటే అంగీకరించరట. దీంతో ఒకరిని విడిచి ఒకరు ఉండరట. ఎక్కడ వదిలివెళ్తే తమ జంటను ముద్దు పెట్టుకుంటారోనని ఆ రోజు కనీసం బాత్రూంకి వెళ్లాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచిస్తారట. ముద్దు పెట్టించుకునేటప్పుడు వద్దు, వద్దు, మొహం తిప్పుకోవడం లాంటివి చేయకూడదట, వారు ఎన్నిసార్లు, ఎన్ని ముద్దులు పెట్టిన పెట్టించుకోవాల్సిందేనట. సంప్రదాయం అంటే ఇదే మరి. 

0 comments:

Post a Comment