నోరూరించే స్వీట్స్ తినాలంటే షుగర్.. వేడి వేడి సమోసాలు, బజ్జీలు
ఆరగిద్దామంటే.. ఊబకాయం... స్పైసీ ఫుడ్ తినాలంటే.. గ్యాస్ట్రిక్
ప్రాబ్లమ్స్.. ఇలా ఆహారం విషయంలో చాలా నిబంధనలు వెంటాడుతున్నాయి. కాబట్టి
హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే.. సీజనల్ ఫ్రూట్స్ మంచి పరిష్కారమంటున్నారు
నిపుణులు. ఎలాంటి ఫ్రూట్ తిన్నా.. ఏ సమస్య ఉండకపోగా, ఆరోగ్యవంతమైన జీవితం
పొందవచ్చు.
వేసవిలో అందరికీ తినాలనిపించే పండ్లు చాలా రకాలుంటాయి. ముఖ్యంగా నీటి శాతం
ఎక్కువగా ఉండే.. ఫ్రూట్స్ చాలానే అందుబాటులో ఉంటాయి. వాటిలో వాటర్ మిలాన్ (
పుచ్చకాయ ), మస్క్ మిలాన్ ( కర్బూజా ) ముఖ్యమైనవి. ఈ రెండు ఫ్రూట్స్
శరీరాన్ని చల్లబరచడమే కాకుండా... వేసవితాపాన్ని తగ్గించి ఉపశమనాన్ని
కలిగిస్తాయి. వీటిలో కర్భూజా అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే
ఫ్రూట్.
వేసవిలో లభించే పండ్లలో కర్బూజ ఒకటి. రుచిలోనే కాదు.. పోషకాలలోనూ ఈ
పండుకు సాటిలేదు. వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించడంలో
కర్భూజపండు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో దాదాపు 92శాతం నీరే ఉంటుంది.
కాబట్టి దీనిని తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందించవచ్చు.
కర్బూజాలో అత్యధికంగా 92 శాతం నీరు ఉంటుంది. అందుకే ఈ పండు అంటే..
చిన్నా, పెద్దా అందరూ ఇష్టపడతారు. దప్పిక తీర్చటంతో పాటు శరీరంలోని
నీటిశాతాన్ని కాపాడి తక్షణ శక్తినిస్తుంది.
కర్బూజాలో విటమిన్ ఏ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో
పోషకవిలువలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఫ్లూయిడ్స్ ను బ్యాలెన్స్
చేస్తాయి.
ఒక కప్పు కర్బూజ ముక్కల్ని తింటే 40 శాతం లైకోపెన్ లభిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు దరి చేరవు.
అధిక రక్తపోటు తగ్గించటంతో పాటు రక్తంలోని చక్కెరశాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది కర్బూజా.
కంటి ఆరోగ్యం, శ్లేష్మాన్ని తగ్గించడానికి కర్బూజా సహాయపడుతుంది.
వేసవిలో కర్బూజ పండు ముక్కలతో పాటు జ్యూస్ తాగటం వల్ల మెరుగైన ఆరోగ్యం
పొందవచ్చు.
కర్బూజ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని నిపుణులు
సూచిస్తున్నారు. అజీర్తి, ఎగ్జిమా, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు
కర్బూజా చక్కటి పరిష్కారం.
కర్బూజాలో అతితక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది బరువు
తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే కర్బూజా విత్తనాల్లో కూడా పొటాషియం
ఉంటుంది. ఇది బెల్లీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది.
కర్బూజ డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి.
కర్బూజలో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి.. ఎవరైనా.. నిర్మొహమాటంగా తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
కర్బూజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది వ్యాధినిరోధక శక్తిని
పెంచుతుంది. అలాగే వైట్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి చేయడానికి, ఇన్ఫెక్షన్స్ తో
పోరాడటానికి సహాయపడుతుంది.
0 comments:
Post a Comment