కాలి బొటనవేళ్లపై వెంట్రుకలు లేకపోతే గుండె
సంబంధిత వ్యాధులకు గురవుతారట. అసలు వెంట్రుకలకు గుండెకు లింకేంటి
అనుకుంటున్నారా... అయితే పూర్తి కథనం చదవాల్సిందే. సాధారణంగా స్త్రీ లేదా
పురుషుల శరీరరంపై పలుచోట్ల వెంట్రుకలు ఉంటాయి. అలాగే కాళ్లపైనా, కాలి
బొటనవేలిపై కూడా కొద్దిగా వెంట్రుకలు ఉంటాయి. అయితే కాలి బొటన వేలిపై
వెంట్రుకలు లేకపోతే ఆ వ్యక్తి గుండె జబ్బులతో బాధపడుతున్నట్టు అర్థమని
డాక్టర్ ఓజ్ తెలిపారు.
ఈ విషయాన్ని డాక్టర్ వివరంగా తెలిపారు.
ఎలాగంటే గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు ధమనుల ద్వారా రక్తం సరఫరా
అవుతుంది. ఇతర శరీర భాగాలతో పోల్చితే గుండె నుంచి దూరంలో ఉన్న కాలి పాదాలకు
కొద్దిగా రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది. గుండె నుంచి రక్తం తీసుకువెళ్లే
ధమనుల పని తీరు సక్రమంగా లేకపోతే, ఏవైనా అడ్డంకులు ఏర్పడితే కనుక బొటనవేలు
ప్రాంతానికి రక్తం సరఫరా సరిగ్గా జరుగదు. అందుకే చేతికైన గాయాలతో
పోల్చుకుంటే కాలి గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఇక కాలి బొటన వేలి మీద వెంట్రుకలు
ఉండడానికి కూడా కారణం గుండె నుంచి సరఫరా అయ్యే రక్తమేనట. అందుకే కాలి బొటన
వేలిపై వెంట్రుకలు లేకపోవడం భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే ఆస్కారం
ఉందట. కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయకూడదట. దీనిని పరిష్కరించుకోవాలంటే
ఆహరంలో వెల్లుల్లిని భాగం చేసుకుంటే ధమనుల్లో ఏర్పడే అడ్డంకులు
తొలగిపోతాయట. అడ్డంకులు తొలిగిపోతే కాలికి రక్తప్రసరణ సాఫీగా జరుగుతుందని
ఓజ్ వెల్లడించారు.
0 comments:
Post a Comment