రోజూ 100 గ్రాముల చాక్లెట్ తినండి..
మధుమేహాన్ని దూరం చేసుకోండి.. అంటున్నారు పరిశోధకులు. రోజుకు వంద గ్రాముల
వరకు డార్క్ చాక్లెట్ తీసుకోవడం ద్వారా చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చునని
లండన్‌లోని వార్విక్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనలో ఈ
విషయం వెల్లడైంది. చాక్లెట్‌లోని పదార్థాలు ఇన్సులిన్ లెవల్స్‌ను
నియంత్రిస్తుందని తద్వారా గుండెపోటు వంటి వ్యాధులకు కూడా చెక్
పెట్టవచ్చును.
వార్విక్ వర్శిటీ నిర్వహించిన పరిశోధనలో 18-69 ఏళ్ల వయస్సు గల 1153 మందిపై జరిపిన పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. రోజూ వంద గ్రాముల చాక్లెట్ తినేవారిలో హృద్రోగ సమస్యలు, డయాబెటిస్ సమస్యలు చాలామటుకు తగ్గిందనేదే. చాక్లెట్ తయారీలో ఉపయోగించే కోకో పదార్థం మధుమేహాన్ని నియంత్రిస్తుందని పరిశోధనలు తెలిపారు.

ఈ పరిశోధనలో 24.8 గ్రాముల చాక్లెట్
రోజువారీ తీసుకునే 80 శాతం మందిలో చురుకుదనం పెరిగిందని పరిశోధకులు
చెప్పారు. అలాగే చాక్లెట్ రోజువారీ తీసుకునే పిల్లలు శారీరకంగానూ,
మానసికంగానూ యాక్టివ్‌గా ఉన్నట్లు.. విద్యాభ్యాసంలో ముందున్నారని వారు
చెప్పుకొచ్చారు.
0 comments:
Post a Comment