మన శారీరక దఃఖాలకి ప్రధాన కారణం కడుపు,
పొట్ట భాగము. మనకు వచ్చే శారీరక దుఃఖాలలో 90% పొట్ట వల్ల వచ్చేవి. 10%
మిగిలిన అవయవాల వల్ల వచ్చేవి. అంటే మోకాళ్ళ వల్ల, భుజాల వల్ల, హృదయం వల్ల,
మెదడు వల్ల ఇలాంటివి 10% మాత్రమే, మిగిలిన 90% రోగాలు పొట్ట వల్లే
వస్తున్నవి. అన్ని రోగాలకి చికిత్స కంటే, రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో
ప్రధానం అంటారు.
మనం తిన్న ఆహారం పొట్టలో సక్రమంగా జీర్ణం
అయిన తర్వాతనే, అది రసంగా మారి, మాంసం, మజ్జ, రక్తము, వీర్యము, మేద, మలం,
మూత్రము ఇలా తయారవుతాయి. కాబట్టి తినడం ఎంత ప్రధానమో సక్రమంగా జీర్ణమవటం
అంతే ప్రధానము.
"భోజనాంతే విషం వారీ", అంటే భోజనం చివర
నీరు త్రాగడం విషంతో సమానము. మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి
చేరుతుంది. అక్కడ అగ్ని( జఠరాగ్ని ) ప్రదీప్తమవుతుంది. ఆ అగ్ని తిన్న
ఆహారాన్ని పచనం చేస్తుంది. ఇది ప్రధానమైన విషయం.
మనం నోట్లో మొదటి ముద్ద పెట్టుకోగానే
లాలజలం ఊరుతుంది. వెంటనే ఆహారాన్ని పచనం చేయడానికి జఠరాగ్ని
ప్రజ్వలిస్తుంది. ఇదేసమయంలో మనం గటగటా నీళ్లు తాగితే, ఆ నీరు జఠరాగ్నిని
చల్లబరుస్తుంది. ఇక తిన్న భోజనం అరగదు, కుళ్ళి పోతుంది. ఆ కుళ్ళిన ఆహారం
వలన విష వాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది. మొట్టమొదట గ్యాస్
ట్రబల్, గొంతులోమంట, గుండెలో మంట, ఎసిడిటీ, అల్సర్, పెప్టిక్ అల్సర్
మొదలగునవి. చివరగా వచ్చేది క్యాన్సర్. ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు
కొలెస్ట్రాల్ అసలు ఉండదు. కాబట్టి భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు.
0 comments:
Post a Comment