ప్రస్తుత కాలంలో బాడీ పెయిన్స్ అనేవి
ఆధునిక జీవన విధానాల దుష్ప్రభావాలు. చాలామంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు,
డెస్క్ జాబ్ చేసుకునేవారు ఎల్లప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే
వుంటారు. ఈ నొప్పులకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ల వేసుకోవడం శరీరానికి అంత
మంచిది కాదు. దానికి ప్రత్యామ్నాయంగా మసాజ్ ఉత్తమం అని చెప్పవచ్చు.
మసాజ్ చేస్తే ఎటువంటి శారీరక నొప్పి అయినప్పటికీ తగ్గిపోతుంది.
సమర్ధవంతమైన చికిత్సా ప్రక్రియగా మసాజ్
థెరపీని కేవలం ఆయుర్వేదంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య
విధానాలలో కూడా వాడుతుంటారు. బాడీ మసాజ్ అంటే తెలియని వారుండరు. థాయ్
మసాజ్, ఆయిల్ మసాజ్ ఇలా మసాజ్‌లో చాలా రకాలే ఉన్నాయి. అయితే వీటన్నింటికి
భిన్నంగా న్యూజెర్సీకి చెందిన డాట్ అనే మహిళ మసాజ్ థెరపిస్ట్ కొత్త మసాజ్
ని కనిపెట్టింది. అదే బైట్ మసాజ్.
బైట్ అంటే కుక్కకాటు అనుకుంటే పప్పులో
కాలేసినట్టే. ఈవిడ నోరుతూ కొరుకుతూ మసాజ్ చేయడం. నోటితో కొరుకుతూ ఈవిడ చేసే
మసాజ్‌కు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. ఈమె 5 సంవత్సరాల వయసు నుంచే ఈ
మసాజ్‌కు ఆజ్యం పోసిందట. ఎంతోమంది హాలీవుడ్ నటీనటులు రిలాక్స్ కోసం ఈవిడ
దగ్గరకొచ్చి మసాజ్ చేయించుకుని వెళుతుంటారట. ఎవడి పిచ్చివారికి ఆనందం అంటే
ఇదేనేమో.
0 comments:
Post a Comment