CSS Drop Down Menu

Wednesday, May 18, 2016

చిన్న కుర్రాడి ఐడియా ఖరీదు 200 కోట్లు!

సాధారణంగా వంద రూపాయలు సంపాదించాలంటే ఎంతో శ్రమించాలి. అదే ఎవరైనా ఉచితంగా డబ్బులిస్తానంటే ఎవరొద్దంటారు చెప్పండి. ఇక్కడ ఒక బుడ్డోడి ఐడియాకి ఏకంగా రూ.200 కోట్ల ఆఫర్ వచ్చింది. కానీ తాను ఐడియాని ఇవ్వనని.. తన ఐడియాతో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్తానని తేల్చిచెప్పేశాడు. 
 
ఈ పూర్తి వివరాలను పరిశీలిస్తే.. అమెరికాలో 14 ఏళ్ల టేలర్ రోసెంథాల్‌కు వచ్చిన ఓ చిన్న ఆలోచన.. వ్యాపార ప్రపంచాన్నే భ్రమింపజేసింది. ఇంతకీ ఈ బుడ్డోడి ఆలోచన ఏమిటంటే.. రకరకాల ఫస్ట్ ఎయిడ్ కిట్‌లతో కూడిన ఏటీఎం మెషీన్‌ను తయారు చేయడమే. శరీరానికి గాయాలైనా, వడదెబ్బకి పడిపోయినా, కాలిన గాయాలకు ఇలా రకారకాల రోగానికి కావలసిన ఫస్ట్ ఎయిడ్ కిట్‌లను ఈ వెండింగ్ మెషీన్ అమ్ముతుంది.
 
సమస్యకు తగిన బటన్ ప్రెస్ చేస్తే చాలు అందుకు సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్ బయటకు వచ్చేస్తుంది. ఈ సరికొత్త ఆలోచన అతనికి ఎలా వచ్చిందో తెలుసా? బేస్ బాల్ పోటీలు జరుగుతున్నప్పుడు తోటి స్నేహితులు గాయపడితే, వారికిఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి తల్లిదండ్రులు మెడికల్ షాపులకు పరుగులు పెట్టడం చూసి అతడికి ఈ ఐడియా వచ్చింది. కాగా రెక్ మెడ్ పేరుతో ఓ స్టార్టప్ సంస్థను టేలర్ స్థాపించాడు.

దీంట్లో ఒక్కో మెషీన్ ధర రూ.35 లక్షలు. ప్రస్తుతం టేలర్ వద్ద 100 మెషీన్లకు ఆర్డర్లు ఉన్నాయట. ఆ ఐడియా తమకు ఇవ్వాలని అందుకుగాను 200 కోట్లు రూపాయలు ఇస్తామని ఓ సంస్థ ముందుకు వచ్చింది. అయినా తన ఐడియాని ఎవరికీ ఇవ్వనని.. తన వ్యాపారాన్ని తానే ముందుకు తీసుకెళ్తానని ఈ బుడ్డోడు ఖరాఖండిగా చెబుతున్నాడు.
 

0 comments:

Post a Comment