CSS Drop Down Menu

Friday, May 6, 2016

బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

“భూవోఘ్రాణ స్వయస్సంధి” అంటే నాసిక పై భాగం భ్రుకుటి మధ్య భాగం కలుసుకొనే చోట బొట్టు పెట్టుకోవాలి అని అర్ధం. ఈ ప్రదేశంలో ఇడ, పింగళ, సుషున్ను అనే ప్రధాన నాడులు కలుస్తాయి. ఇది ఆజ్ఞా చక్రం అని పిలువబడే పీయూష గ్రంధికి అనుబంధ స్థానం. దీనినే జ్ఞానగ్రంధి అని కూడా పిలుస్తారు. ఎవరైతే సుషున్ను నాడికి చురుకుదనం కల్గిస్తారో వారు మేథావులవుతారు. మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యూటరీ గ్రంధులపై ఉంటుంది. కేనన్ అనే పాశ్చాత్య శాస్త్రవేత్త భ్రుకుటి స్థానాన్ని మానవ ధన(+),  మెడ వెనుక భాగాన్ని ఋణ(-) విద్యుత్ కేంద్రాలుగా పేర్కొన్నాడు. 

ఈ రెండు మానవ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరణం చేస్తూంటాయి. అందుకే జ్వరం వచ్చినప్పుడు వైద్యులు నుదుటిపై చల్లని వస్త్రాన్ని వేయమంటారు. ఈ కీలకమైన సున్నిత నాడులను తీక్షణమైన సూర్యకిరణాల నుండి కాపాడేందుకు కుంకుమను ధరించాలి. సాయంత్రం - రాత్రి సమయాల్లో కుంకుమకు బదులుగా విభూతిని ధరిస్తే చల్లగా ఉంటుంది. విభూతి వల్ల రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. ఓజస్సు వృద్ధి చెంది, చర్మ రోగాలు రాకుండా రక్షణ కలుగుతుంది.
 
బొట్టు శరీరంలోని ఉష్ణాన్ని పీల్చివేస్తుంది. జఠర కోశాలకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది. మనం సూర్యుడిని నేరుగా చూడలేము. అదే రంగుల కళ్ళద్దాలు లేదా ఒకవైపు రంగు ఉన్న గాజు ద్వారా సూర్యుని చూడగలం. ఎందుకంటే సూర్యుని కిరణాలు అద్దంపై పడి పరావర్తనం చెందటం వల్ల కళ్ళకు హాని కలుగదు. అంటే ఇక్కడ సూర్య కిరణాల వల్ల కళ్ళకు హాని కలుగకుండా రంగు ఏవిధంగా పని చేస్తుందో, ఆవిధంగానే బొట్టు కూడా భ్రుకుటి స్థానం లోని జ్ఞాననాడికి హాని కలుగకుండా మానవులను కాపాడుతూ ఉంటుంది.


0 comments:

Post a Comment