ఓ వ్యక్తికి లాటరీ తగిలింది. అతను కోటీశ్వరుడయ్యాడు. అయినప్పటికీ తన
పాత వృత్తిని మానుకోనని చెబుతున్నాడు. తాను కూలీ పని చేసేవాడినని, ఇప్పుడు
అదే చేస్తానని చెబుతున్నాడు. అయితే, కేవలం ఓవర్ టైమ్ చేయడం మాత్రమే
మానేస్తానని చెప్పాడు.
సాధారణంగా ఎవరికైనా లాటరీ తగిలి కోట్లు వచ్చినా, అనుకోకుండా పెద్ద మొత్తంలో
డబ్బులు వచ్చినా కార్లు కొంటారు. భవంతులు కొంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు.
అంతేకాదు, ఏదైనా చిన్న పని చేసి ఉంటే లాటరీ తగలగానే మానేయడానికే చూస్తారు.
కానీ లండన్‌కు చెందిన కార్ల్ క్రూక్ మాత్రం తాను మళ్లీ నిర్మాణ
పనుల్లో కూలీకి వెళ్తానని చెప్పాడు. ఓసారి...