జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డికి మొన్నటి నుండి
వరుసపెట్టి షాకులు తగులుతున్నాయి. రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ
ఆయనతో సహా మరో 24మంది వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు మొన్న
తిరస్కరించింది. ఆ తరువాత నిన్న గుంటూరు జిల్లాలో జైసపా
అభ్యర్ధులు నలుగురు పోటీ నుండి తప్పుకోవడమే కాకుండా రాయపాటి
సమక్షంలో తెదేపాలో చేరిపోయారు.
ఈరోజు ఆ పార్టీ టికెట్ పై వైజాగ్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న
సబ్బం హరి కూడా పార్టీకి రాజీనామా చేసి,బీజేపీ అభ్యర్ధి కంబంపాటి
హరిబాబుకి మద్దతుగా పోటీ నుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో నా మూలంగా ఓట్లు చీలి వైకాపా అభ్యర్ధి విజయమ్మకు
లబ్ది కలగకూడదనే ఆలోచనతోనే నేను పోటీ నుండి తప్పుకొంటున్నాను
అన్న సబ్బం హరి గారికి ఈ విషయం ఇప్పుడే తెలిసిందా ?
జై సమైఖ్యాంధ్ర పార్టీ తరపున నిలబదేటపుడు తెలియలేదా ??
తెలుగుదేశం, బీజేపీల పై ఇంతెత్తున ఎగిరిపడ్డ సబ్బం హరి గారికి సరిగ్గా
ఇప్పటికిప్పుడే జ్ఞానోదయం అయి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలంటే
రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి
అధికారంలోకి రావాలని కోరుకొంటున్నాను,” అని అంటున్నారంటే ? దీని
వెనుక గల మర్మమేంటో ?? ఆపైవాడికే తెలియాలి. పాపం ఇప్పటివరకు
తన కుడిభుజం అనుకుంటున్న కిరణ్ కుమార్ రెడ్డికి, పార్టీజెండాలు
భుజాలమీద మోసిన కార్యకర్తలకు చివరి నిముషంలో దిమ్మతిరిగి
మైండ్ బ్లాకయ్యేలా షాక్ ఇచ్చిన సబ్బం హరిగారి ఇమేజ్ కాస్తా బురదలో
పోసిన పన్నీరులా తయారయింది.

0 comments:
Post a Comment