అరటిపండు అన్ని వేళలా అందరికీ ప్రియమైన మరియు చౌకైన ఫలము.
కొన్ని వందల సంవత్సరాల నుంచే అరటి పండు అన్ని ఋతువులలో
ఎల్లవేళలా అందుబాటులో చలామణి అవుతున్న ఫలము.
దీనికి స్పష్టత చేకూర్చే గుణాలు చాలా వున్నాయి.
ఇది విరివిగా మరియు చౌక ధరల్లో అన్ని వేళలా అన్ని ప్రాంతాలలో
లభిస్తుంది. అన్ని రకాల అరటి పండ్లలో ఏదో ఒక విధమైన లాభం చేకూర్చే
గుణం వున్నాయి. అరటి పండు తీసుకుంటే తగు శక్తి, సహజ చక్కెరలు,
(గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్) తక్షణం శరీరానికి అందుతాయి. దీనిలో పీచు
పదార్థాల మోతాదు కూడా ఎక్కువగా వుంటుంది.ఈ పండులో తక్షణం
శక్తినిచ్చే గుణం ఉంది. ఇది సంవత్సరం పొడవునా దొరుకుతుంది.
దీనిని మన జీవన విధానంలో చేర్చడం ద్వారా జీవక్రియలకు కావాల్సిన
ఆంటి యాక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పొందవచ్చు. 100 గ్రాముల
అరటి పండులో... 90కాలరీల శక్తి,10 గ్రాముల ఫైబర్, 12 గ్రాముల షుగర్
ఉంటాయి. జీవక్రియలకు ఉపయోగపడే పోషకాలు దీనిలో మెండుగా
ఉంటాయి. అరటి పిల్లల ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది.
దీనిలో విటమిన్ ఎ,బి, సి లు అత్యధికంగా ఉంటాయి. ఇందులో శరీరానికి
హాని చేసే కొవ్వు ఉండదు.. పైగా అరటి నుంచి కావాల్సినంత కాల్షియం,
ఐరన్ లభిస్తుంది. రక్త పోటును తగ్గించడంలో, గుండె పనితీరును మెరుగు
చేయడంలో ఉపయోగపడే మూలకాలలో ఒకటైన పొటాషియం ఈ అరటి
పండులో అత్యధికంగా ఉంటుంది. అరటి పండును రోజూ తీసుకుంటే
ఎటువంటి జబ్బులు ? నయం అవుతాయో ?? మీకు తెలుసా???
అవేంటో మరి చూద్దాం...
తక్షణ శక్తిని అంధిస్తుంది:
అరటిపండ్లులో 105క్యాలరీలు కలిగి ఉంటుంది. తక్షణ శక్తిని అందివ్వడంలో
చాలా అద్భుతంగా సహాయపడుతుంది
మజిల్ క్రాంప్స్ :
మజిల్ క్రాంప్స్ ను నివారిస్తుంది. వ్యాయామం చేసేవారి కండరాలు
పట్టివేతను నివారిస్తుంది. కండరాలను బలహీనతను నివారించడంలో
అరటిపండ్లు బాగా సహాయపడుతాయి.
బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:
అరటిపండులో పొటాషియం కన్నా సోడియం తక్కువ ఉంటుంది.
ఇందు మూలంగా రక్తపోటు ఉన్న వారికి కూడా ఇది మంచి పోషకాహారము.
అరటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపు చేయడంలో కీలక పాత్ర
వహిస్తుంది.
అసిడిటిని దూరం చేస్తుంది:
అరటిపండు సహజ గుణము కలిగి ఉన్నది దీని మూలంగా గుండెలో మంట
నుంచి శీఘ్రంగా ఉపశమనం కలుగుతుంది. అల్సర్‌కు అరటిపండు
దివ్యౌషధంగా పనిచేస్తుంది. అరటిలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉండటంతో
అంటువ్యాధులు దరిచేరవు.
మలబద్దకాన్ని నివారిస్తుంది:
పీచు పదార్థములు అధికంగా ఉండడము మూలంగా మల విసర్జన
సాధారణంగా జరగడంలో సహాయపడుతు మలబద్దకం నుంచి కాపాడుతుంది.
డయోరియా నుండి త్వరగా కోలుకొనేలా చేస్తుంది:
డయోరియా సమస్యతను బాధపడినప్పుడు డయోరియా తర్వాత పేషంట్
త్వరగా కోలుకోవడానికి మరియు శరీరానికి పూర్తి హైడ్రేషన్ అంధివ్వడానికి
అరటి పండ్లు సహాయపడుతాయి.
ప్రొబయాటిక్ ఎఫెక్ట్ ను నేచురల్ గా అంధిస్తుంది:
ఫ్రొబయాటిక్ ఎఫెక్ట్ ఫ్రక్టూలిగోసర్చాడిస్ అనే అంశం అరటి పండ్లలో ఉండి
శరీరంలో బ్యాక్టీరియాను నివారించడానికి సహాయపడుతుంది.
ఎముకల బలానికి అవసరం అయ్యే క్యాల్షియంను అంధిస్తుంది.
మంచి నిద్రను అంధిస్తుంది:
అరటిపళ్లలో మెగ్నీషియం, పొటాషియం హెచ్చుమోతాదులో ఉన్నాయి.
ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కని నిద్రపట్టేలా చేస్తాయి. అరటి పండు
మనం నిద్రిస్తున్నపుడు రక్తపోటుని కూడా నియం త్రించగలుగుతుంది.
అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ.
ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే
కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు. అరటి పండులో పొటాషియం
మోతాదు చాలా ఎక్కువ. శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను
తొలగిస్తుంది. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో
ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది.
అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.
గ్లోయింగ్ స్కిన్:
అరటి పండ్లులో విటమిన్ ఎ, విటమిన్ బి మరియు విటమిన్ ఇ పుష్కలంగా
ఉండి, యాంటీఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బాగా పండిన అరటి పండును
మెత్తగా చేసి, అందులో కొద్దిగా తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి
అప్లై చేయడం వల్ల చర్మ కాంతివంతంగా మారుతుంది . ఇందులో ఫైబర్ ,
మినిరల్స్, మెగ్నీషియం, మరియు పొటాషియం అధికంగా ఉండి,
మన శరీరంలో రక్తప్రసరగా సరిగా జరిగేలా చేస్తుంది. రోగనిరోధకతను
పెంచుతుంది.
సెక్స్ లైఫ్ మెరుగుపరుస్తుంది :
అరటి పండులో ఉండే బ్రొమెలైన్(bromelain)అనే ఎంజైమ్ లిబిడోను
పెంపొందిస్తుంది మరియు పురుషుల్లో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది.
అంటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి
కావల్సినంత శక్తిని అంధిస్తుంది.
0 comments:
Post a Comment