CSS Drop Down Menu

Monday, May 26, 2014

పురుషుల్లో "వీర్యకణాల సంఖ్య" తగ్గడానికి గల కారణాలు ...


సాధారణంగా కొందరిలో పిల్లలు కలగక పోవడానికి దోషం ఎవరిలో ఉంది?
 ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని,
 ముద్ర వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. అయితే
 దంపతుల మధ్య నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు
 లేదా ఇద్దరూ కారణం కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు.
 దంపతులలో సంతానం కలగకపోవటానికి భార్యాభర్త లిరువురిలోనూ
 లోపాలుండవచ్చు, వైద్య పరిభాషలో సంతానం కలగకపోవటానికి 40%
 వరకు ఆడవారిలో లోపాలుండవచ్చు, లేదా 30% వరకు మగవారిలో
 లోపాలుండవచ్చు, లేదా 20% వరకు ఇద్దరిలో లోపాలుండవచ్చు,
 లేదా 10% వరకు దంపతులిద్దరిలోనూ చెప్పలేని లేదా కొన్ని తెలియని
 కారణాలవల్ల కూడా సంతానం కలగకపోవచ్చు. గర్బదారణం అంటే కేవలం
 సెక్స్ చేయటం మాత్రమే కాదు ఇంకా చాల విషయాలు ఉన్నాయి. పిల్లలు
 పుట్టట్లేదు అంటే చాల కారణాలు ఉన్నాయ్ అందులో ఒకటి స్పెర్ము కౌంట్,
 స్పెర్ము ఎలర్జీ, గుడ్డు నాణ్యత మరియు అసమర్థ స్పెర్మ్. ఈ మద్య జరిగిన
 అద్యయనాల్లో ప్రతి పది జంటల్లో ఒక జంటకి పిల్లలు పుట్టట్లేదు అని
 తేలింది దానికి కారణం కూడా మగవారిలో తగ్గిన  స్పెర్ము కౌంట్. ఆడవారు
 గర్బం దరించాలంటే పురుషుడు కనీసం 40 మిలియన్ స్పెర్మ్స్ విడుదల
చేయాలి కానీ అలకావటం లేదు దీనికి కారణం మనమే చేసుకుంటున్నాం.
 స్పెర్మ్ కౌంట్ 20 మిలియన్ల కన్నా అధికంగా ఉన్నప్పుడు దానిని నార్మల్
 కౌంట్‌గానే పరిగణిస్తాం. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం వెనుక లైఫ్‌స్టైల్ మారడమే
 అసలు కారణంగా సర్వేలు నిగ్గు తేల్చాయి. మగవారిలో స్పెర్మ్ కౌంట్
తగ్గడానికి జంక్ ఫుడ్ కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పొగాకు, గుట్కాల్లోని
 నికోటిన్ వీర్య కణాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తోంది. నైట్ షిఫ్టులు కూడా
 ఓ కారణమే.. వాతావరణ కాలుష్యంతోనూ,విలాసవంతమైన జీవితమే
 మగాడిని తండ్రిని కాకుండా చేస్తోంది. భార్యాభర్తల మధ్య అవగాహన
 లేకపోవడం, అవకాశం ఉండీ.. సెక్స్‌లో పాల్గొనకపోవడం కూడా పొరపాటే.
 ఇటువంటి విషయాలమీద మగవారికి సరైన అవగాహన లేకపోవడం చేత
 స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. కాబట్టి, మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడానికి
 కొన్ని కారణాలు...

వేడి నీటి స్నానం: మీరు చదివింది కరెక్ట్. వేడి నీటితో టబ్ స్నానం చేస్తే
 వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది. వేడినీటి స్నానం చాలా విశ్రాంతి కలిగిస్తుంది
 అయితే, పురుషులు వేడి నీటి స్నానానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.
 ఎందుకంటే స్పెర్మ్ కౌంట్ మీద ప్రభావాన్ని చూపెట్టి స్పెర్మ్ కౌంట్ ను
 తగ్గిస్తుంది. వేడి నీళ్ళ స్నానం శరీరంలో వేడిని పుట్టించి స్పెర్మ్ కౌంట్
 తగ్గేలా చేస్తుంది.

బ్రిఫ్స్: బ్రీఫ్స్ వీటి వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గే అవకాశ౦ లేకపోలేదు అని
 పరిశోదకులు బావిస్తున్నారు. కానీ బ్రీఫ్స్ కంటే బాక్సర్లు చాల ఉత్తమం
 అని చెప్పారు. బ్రీఫ్స్ చాల గట్టిగ అమర్చడం ద్వార దీర్గాకాలం వృషణాలు
 దగ్గర వేడిచేస్తుంది దీని మూలంగా వీర్యకణాల సంఖ్య తగ్గవచ్చు.
 ఇక లోదుస్తులు మార్చుకోకపోవడం అనేది చాలా మంది పురుషుల్లో ఈ
 అలవాటు ఎక్కువగా ఉంది. ఇది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు
దారితీస్తుంది. బాహుమూలల్లో ఇన్ఫెక్షన్ కు గురిచేస్తుంది. కాబట్టి స్నానం
 చేసిన ప్రతి సారి లేదా ప్రతి రెండు రోజులకొకసారి తప్పనిసరిగా లోదుస్తుల
 మార్చుకోవడం చాలా అవసరం. మరియు ఆరోగ్యకరం.

మొబైల్ ఫోన్: మీ భార్య గర్భవతి కావాలి అనుకుంటే మీరు మొబైల్
 ఉపయోగం బాగా తగ్గించాలి. ఈ మద్య జరిగిన అధ్యయనంలో ఎవరైతే
 మొబైల్ రోజుకు నాలుగు గంటలు మాట్లాడతారో వాళ్ళల్లో వీర్యకణాల
 సంఖ్య బాగా తగ్గినట్టు గుర్తించారు. దీనికి కారణం ఏంటంటే మగవారు
 మొబైల్ ను ప్యాంటు జేబులో పెట్టుకుంటారు అందువల్ల మొబైల్ కి వచ్చే
 రేడియేషన్ వల్ల వృషణాలు బాగా వేడిని గ్రహిస్తాయి. దీని వలన వీర్యకణాల
 సంఖ్య తగ్గిపోతాయి.

ఒత్తిడి: మహిళల్లోనే కాదు, పురుషుల్లో కూడా ఒత్తిడి కారణంగా చాలా రకాల
 ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. ఒత్తిడి వల్ల మీ మానసిక
 ఆరోగ్యాన్ని దెబ్బతియ్యడమే కాదు, ఒత్తిడి పురుషుల్లో వంధ్యత్వం సమస్యలకు
 దారితీస్తుంది.

లైంగిక సమస్యలు: లైంగిక జీవితానికి దూరంగా ఉండటం వల్ల వీర్యకణాల
 సంఖ్య తగ్గుతుంది. దాంతో దాని ఆకారం మార్చుకొని, వీక్ గా మారుతుంది.
 భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోవడం, అవకాశం ఉండీ.. సెక్స్‌లో
 పాల్గొనకపోవడం కూడా పొరపాటే.

మద్యపానం:  ఎవరైతే పిల్లలు కావాలని అనుకుంటారో వారు మద్యం తాగటం
 మానివేయాలి. మద్యం తాగడం వల్ల మగవారిలో టెస్టో స్టిరాన్ లెవల్స్
 తగ్గిపోతాయి. దాంతో మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. మగవారిలో
 వంద్యత్వానికి ఇది ఒక ప్రధాన కారణం. మద్యం వల్ల శరీరం జింక్ శోషణ
 చేయలేదు . జింక్ అనేది స్పెర్మ్ సెల్ ఏర్పడటానికి ఎంతో అవసరం.

ధూమపానం : పురుషుల వీర్యకణాలు తగ్గడానికి ముఖ్యకారణం పొగత్రాగడం. పొగత్రాగడం వల్ల వీర్యకణాలు జీవం కోల్పోవడం లేదా చురుకుగా ఉండకపోవటం జరగుతుంది. దాంతో పురుషుల్లో వంధ్యత్వానికి కారణం అంతుంది. కాబట్టి స్మోకింగ్ కూడా మనిషిని నపుంసకుడుని చేయవచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన పిల్లలకు కలగడానికి స్త్రీలైనా, పురుషులైనా పొగత్రాగడం మానేయడం  చాలా మంచిది. పురుషుల్లో ఇదొక సాదారణ మరయు అనారోగ్యపు అలవాటు. చాలా వరకూ చాలా మంది పురుషులు సిగరెట్ త్రాగడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చని భావిస్తారు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి సిగరెట్ ను స్ట్రెస్ బూస్టర్ గా భావిస్తారు. కానీ, ఇది స్పెర్మ్ కౌంట్ ను తగ్గించే సైలెంట్ కిల్లర్ అని తెలుసుకోలేరు.

సోయా ప్రొడక్ట్స్: మగవారు రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లో సోయా ప్రొడక్ట్స్
 అధికంగా ఉండటం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణం అవుతంది. స్పెర్మ్ కౌంట్ క్వాలిటీ మరియు ఉత్పత్తి మీద చెడు ప్రభాన్ని చూపే ఐసోఫ్లేవొనిస్ సోయాప్రొడక్ట్స్ లో ఉండటమే ప్రధానకారణం.

టీవీ చూడటం: వారంలో 20గంటల కంటే ఎక్కువగా టీవీ చూసే మగవారిలో
 వీర్యకణాల సంఖ్య సగానికి తగ్గిపోతాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. కాబట్టి బెటర్ స్పెర్మ్ కౌంట్ కోసం రెగ్యులర్ గా వర్క్ అవుట్ చేయడంతో పాటు మంచి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

ల్యాప్ టాప్: చాలా మంది పురుషులు కొత్త వీడియోలను చూడటం లేదా
 ఎప్పుడూ సోషియల్ మీడియా సైట్లలో నిమగ్నం అవ్వడం లేదా మార్కెట్లో
 కొత్త కార్లు, కొత్త బైక్ లు ఏవేవీ లాంచ్ అయ్యాయో అని తనిఖీ చెయ్యండం!
 ఇది దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీస్తుంది. ఇది ఒక చెడు అలవాటు.
 మీ కళ్ళకు విశ్రాంతి ఇవ్వాలి. మరియు కంటి నిండా ప్రతి రోజూ తగినంత
 నిద్రను నిద్రపోవాలి.

ఒబేసిటీ: పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మనలో చాల మంది ఒబేసిటీ కి
 బానిసలూ అవుతున్నారు. ఊబకాయం వల్ల చాల సమస్యలు ఉన్నాయి
 అందులో ఈ సెక్స్ సమస్య కూడా ఒకటి.ఊబకాయం ఉన్నవారిలో సెక్స్
 గ్లాండ్స్ పని తీరు చాల నెమ్మదిగా ఉంటుంది. ఇది ఆడవారిలో ఊబకాయం
 హర్మోనే పెరగటం, అదే మగవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గటం జరుగుతుంది.
 అనేక పరిశోధనలు లో ఒబేసిటీ వల్ల పురుషులు వృషణాల ఫంక్షన్ మరియు వీర్యకణాల సంఖ్య తగ్గినట్టు కనుగొన్నారు.

ఆలస్యంగా నిద్రపోవడం: పని చేయడం ఆలస్యం అయినా లేదా టీవీ చూడటం వల్లో లేటుగా నిద్రపోడం చాలా అనారోగ్యకరమైన చెడు అలవాటు. సరిగా నిద్రలేకపోవడం వల్ల హార్మోనుల అసమతుల్యత ఏర్పడుతుంది. చాలా మంది పురుషులు రాత్రి 12 లేదా 1గంట లోపు నిద్రపోవడానికి ఇష్టపడరు! అందుకే మరుసటి రోజు వారు అలసటగా కనబడుతారు. కాబట్టి సరైన సమయానికి నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోవాలి.









0 comments:

Post a Comment