CSS Drop Down Menu

Saturday, May 24, 2014

‘టీ’ త్రాగండి ! బరువు తగ్గండి !!


బరువు తగ్గడం అంటే అంత సులభం కాదు. అందులోను  రుచికరమైన వంటలు స్నాక్స్, పిజ్జా, బర్గర్, చీజ్ సాండ్విచ్ మరియు చాక్లెట్స్ డిజర్ట్స్ తినే వారు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. కోరికలను కంట్రోల్ చేసుకోలేక, అధికంగా ఏది పడితే అది తింటూ మరింత అధిక బరువును పొందుతున్నారు. దాంతో వ్యాయామాలు చేయడం మరియు బరువును తగ్గించుకోవడం మరింత కష్టంగా మారుతోంది.
 అయితే అధనపు బరువు తగ్గించుకోవడానికి వ్యాయామాలు మరియు డైట్
 మాత్రమే సరిపోవు. బరువు తగ్గించుకొని మీకు నచ్చిన షేప్ ను పొందడానికి
 ఇతర మార్గాలు కూడా అనేకం ఉన్నాయి .బరువు తగ్గించుకోవడానికి కొన్ని సూపర్ ఫుడ్స్ మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మరియు ఇతర బెవరేజెస్(ద్రవాలు)వంటివి బరువు తగ్గడానికి చాలా మేలు చేస్తాయి. బరువు తగ్గించే వెజిటేబుల్స్ మరియు పండ్ల గురించి మనం ఇంతకు ముందు చాలానే తెలుసుకొన్నాం. అయితే బెవరేజెస్ కూడా బరువు
 తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతాయి అందులో ముఖ్యంగా ‘టీ'.
 బరువు తగ్గించే వివిధ రకాల టీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
 ఇవి బరువు తగ్గించడంతో పాటు, అనేక ఆరోగ్యప్రయోజనాలు కూడా కలిగి ఉన్నాయి . టీ శక్తిని ఇస్తుంది. అలాగే టీలో హార్టో స్ట్రోక్ మరియు యాంటీక్యాన్సర్ లక్షణాలు కలిగి ఉన్నాయి. అలాగే బరువు తగ్గించే లక్షణాలు కలిగిన టీ చాలా పాపులర్ అవుతోంది.
 మరి బరువు తగ్గించే వివిధ రకాల టీల గురించి తెలుసుకుందాం...

లెమన్ టీ: శరీరాన్ని పొట్టను డిటాక్సిఫై చేయడంలో బాగా సహాయపడుతుంది. మీ మైండ్ ను రిఫ్రెష్ చేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది ఈ లెమన్ టీ. మరియు బరువు తగ్గిస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గిస్తుంది. ఒక కప్పు వేడినీళ్ళు, తేనె, నిమ్మరసం మిక్స్ చేసి రెగ్యులర్ గా తీసుకోవాలి.



గ్రీన్ టీ: మీరు బరువు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నప్పుడు, మీరు గ్రీన్ టీ
 తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. గ్రీన్ టీలో ఉన్న యాంటీఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్యాట్స్ ను కరించి బరువు తగ్గించడానికి బాగా సహాయపడుతాయి. అదే విధంగా గ్రీన్ టీలో కెమికల్స్ కూడా శరీరంలో మెటబాలిజం(జీవక్రియలు)చురుకుగా పనిచేసేలా చేస్తుంది. దాంతో శరీరంలో టాక్సిన్స్ బయటకు నెట్టివేస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.



రెడ్ టీ లేదా జాస్మిన్ టీ: జాస్మిన్ టీ బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. తిన్న ఆహారం విచ్ఛిన్నం చేయడంలో అద్భుతంగా సహాయయపడుతుంది. జాస్మిన్ టీలో యాంటీఆక్సిడెంట్స్ మరియు బరువు తగ్గించే కెఫిన్ ముఖ్యంగా ఇజిసిజి పుష్కలంగా ఉన్నాయి .



ఊలాంగ్ టీ: ఊలాంగ్ టీ సెమీ ఫెర్మినేటెడ్ టీ ఇతర టీలతో పోల్చినప్పుడు ఈ టీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఊలాంట్ టీ స్థూలకాయంను నివారించడంలో మరియు బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఎవరైతే అధిక బరుతుతో బాధపడుతున్నారో అటువంటి వారికి ఊలాంగ్ టీ ఒక ఉత్తమ ఔషదంగా ఎక్కువగా తీసుకోమని సలహాలిస్తున్నారు. ఊలాంట్ టీ కొవ్వును తగ్గిస్తుంది, ఫ్యాట్ ను కరిగిస్తుంది మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఊలాంట్ టీని రెగ్యులర్ గా తీసుకోవాలి.



స్టార్ ఆన్సి టీ: స్టార్ ఆన్సీ ఇది మన ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటి. వంటలు మంచి ఫ్లేవర్స్ కోసం మన ఇండియన్ కుషన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. జీర్ణసమస్యలు మరియు కడుపు సంబంధిత సమస్యలు, డయోరియా, వికారం వంటి సమస్యలకు అద్భుతంగా ఔషధం.
 ఒక కప్పు వేడి నీళ్ళలో ఒక స్టార్ ఆన్సీ ని వేసి బాగా మరిగించి తర్వాత వడగట్టి తీసుకోవడం వల్ల ఈ సమస్యలను నివారించడంతో పాటు, బరువు కూడా తగ్గిస్తుంది.



రోజ్ టీ: రోజ్ టీ ని, ఫ్రెష్ గా ఉండే రోజా పువ్వు రేకులను టీలో వేసి, బాగా మరిగించి గోరువెచ్చగా తీసుకోవడం. రోజ్ టీ మలబద్దకం నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. మలబద్దకం వల్ల కడుపు ఉబ్బరం మొదలువుతుంది. రోజ్ టీ శరీరంలోని టాక్సిన్స్ తొలగించి చర్మంకి మంచి
 మెరుపు తీసుకొస్తుంది. మరియు బరుతు తగ్గించడానికి గొప్పగా సహాయపడుతుంది.

బ్లాక్ టీ: బ్లాక్ టీ ముఖ్యంగా, ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా మిక్స్ చేస్తారు. ఇది బరువు తగ్గడానికి అద్భుతంగా సమాయపడుతుంది. ఎటువంటి శ్రమ మరియు డైట్ ప్లాన్ లేకుండానే ఇది బరువు తగ్గిస్తుంది. బ్లాక్ టీ విత్ లెమన్ మీ ఎనర్జీ లెవల్స్ పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ తొలగించడానికి అద్భుతంగా సహాపడుతుంది. ఇంకా బ్లాక్ టీ జీర్ణక్రియకు మరియు జీవక్రియలను శుభ్రపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.



ఇండియన్ మిల్క్ టీ: ఇండియన్ టీలో ఎక్కువగా పంచదార చేర్చడం వలో ఇది ఆకలిని కంట్రోల్లో ఉంచుతుంది. కాబట్టి, బరువు తగ్గాలనుకొనే వారు, ఇండియన్ టీకు రెగ్యులర్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్ లేదా షుగర్ లేకుండా మరియు బాగా కాచి మీగడతీసిన పాలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఆకలి కోరికలను తగ్గిస్తుంది. దాంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యి, కొవ్వు కరగడానికి సహాయపడుతుంది.



పెప్పర్ మింట్ టీ: పెప్పర్ మింట్(పుదీనా టీ)ఇది మీ జీర్ణవ్యవస్థను వేగవంతం చేస్తుంది మరియు ఎక్కువ క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. తాజాగా ఉన్న పుదీనా ఆకులను కొద్దిగా టీలో వేసి కాచి, గోరువెచ్చగా లేదా చల్లాగా కూడా తీసుకోవచ్చు. పుదీనా ఆకలు తాజావి లేదా ఎండినవి తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి బాగా మరిగించి తర్వాత ఒక గ్లాసులోనికి వడగట్టి, తేనె మిక్స్ చేసి చల్లగా లేదా గోరువెచ్చగా తీసుకోవచ్చు.



వైట్ టీ : ఇది చాలా లేలేత టీఆకలు, మొగ్గలతో తయారుచేసేటువంటి టీ. ఇతర టీలతో పోల్చితే ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వైట్ టీలో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వైట్ టీ కొవ్వు కొత్తకణాలు ఏర్పడకుండా నిలుపుదల చేస్తుంది.
 కొవ్వు కరింగించడానికి సహాయపడుతుంది.



అల్లం టీ: అల్లంలో అనేక యాంటీబ్యాక్టిరయల్ లక్షణాలు ఉండి దగ్గు, జలుబు వంటి వ్యాధులను నివారించడంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరిచి, జీవక్రియలు వేగవంతం చేసి, కొవ్వు కరిగేందుకు సహాయపడుతుంది.



 చమోమిలి టీ: చామంతి టీలో యాంటీఆక్సిడెంట్స్ డయాబెటిస్ వంటి కాంప్లికేషన్స్ తగ్గించడంలోనే మరియు కంటిచూపు మెరుగుపరిచి, నరాలు, కిడ్నీ డ్యామేజ్ ను మరియు క్యాన్సర్ కణాలతో పోరాడటంలో అద్భుతంగా పనిచేస్తుంది మరియు ఇది కొలెస్ట్రాల్ కూడా తగ్గించి, బరువు తగ్గడానికి
 సహాయపడుతుంది.



హైబిస్కస్ టీ: హైబిస్కస్ టీ: రెగ్యులర్ గా 3కప్పుల మందార టీ తీసుకోవడం వల్ల, బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. కొవ్వు కరిగించి బరువు తగ్గిందుకు సహాయపడుతుంది.
















0 comments:

Post a Comment