CSS Drop Down Menu

Tuesday, May 27, 2014

కారు నుంచి "ఎక్కువ మైలేజ్" పొందటం ఎలా ?



ఇంధన ధరలు నానాటికీ పెరుగుతున్న తరుణంలో, ఇప్పుడు కార్లను
 వినియోగించేవారు ప్రధానంగా మైలేజ్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
 వాహనాలను వినియోగించే వారిలో చాలా మంది తమ వాహనం మెరుగైన
 మైలేజీనిస్తే బాగుండు అని అనుకుంటుంటారు.

ఈ నేపథ్యంలో, కొందరు కార్ మైలేజ్‌ను పెంచుకునేందుకు తాత్కాలిక
 ప్రయత్నాలు చేసినా, లాంగ్ రన్‌లో మాత్రం కార్లు డ్యామేజ్ అవటం ఖాయం.
 ఎందుకంటే, ఇలాంటి వారు సరైన డ్రైవింగ్ అలవాట్లను పాటించకపోవటమే
 ఇందుకు కారణం.

వాస్తవానికి మనం వినియోగించే వాహనాలను ఆచితూచి డ్రైవ్ చేసినట్లయితే, ఇంధనంవృధాకావాటాన్నిఅరికట్టిఅధికమైలేజ్‌నుపొందవచ్చు.
  కార్ మైలేజ్‌ను పెంచుకునేందుకు పాటించాల్సిన మంచి డ్రైవింగ్ అలవాట్లను
 తెలుసుకుందాం రండి..!

1. వివేకంతో డ్రైవ్ చేయండి:- చాలా వరకు కార్లు గంటకు 60-80 కి.మీ. మధ్య
 వేగంతో డ్రైవ్ చేసినప్పుడు బెస్ట్ మైలేజీనిస్తాయి. కాబట్టి మితిమీరిన వేగం,
 అనవసరమైనయాక్సిలరేషన్,అసందర్భబ్రేకింగ్‌లనుతగ్గించుకోగలిగినట్లయితే, ఇంధన వినియోగం తగ్గి మైలేజ్ మరింతపెరుగుతుంది. హైవేలపై గంటకు
 80-90 కి.మీ. వేగంతో వెళ్లటం వలన సుమారు 30 శాతానికి పైగా మైలేజ్‌ను
 కోల్పోవటం జరుగుతుంది. అలాగే,సిటీరోడ్లపైఅనవసరబ్రేకింగ్,యాక్సిలరేషన్
 కారణంగా సుమారు 5 శాతం మైలేజ్‌ను కోల్పోవటం జరుగుతుంది.

2. స్మూత్‌గా డ్రైవ్ వ్యవహరించండి:- ఇంధనాన్ని ఆదా చేసుకోవటంలో ముఖ్యమైనది వాహనంతో సున్నితంగా వ్యవహరించడం. డ్రైవింగ్‌లో గేర్లను మార్చేటప్పుడు, యాక్సిలరేషన్ విషయంలో వాటితో మొరటుగా వ్యవరించకుండా, సున్నితంగా వ్యవహరిస్తే మెరుగైన మైలేజీని పొందటమే కాకుండా, వాహనంలో తలెత్తే కొన్ని సమస్యలను కూడా అరికట్టవచ్చు. హార్ష్ యాక్సిలేషన్ వలన అధిక ఇంధనంఖర్చుఅవుతుంది.సిటీలోవెళ్తున్నప్పుడు రెడ్ సిగ్నల్‌ను గమనిస్తే, వీలైనంత ముందు నుంచే యాక్సిలరేషన్‌ను తగ్గించుకోండి. అలాకాకుండా, సిగ్నల్ చేరుకునే చివరి నిమిషం వరకూ యాక్సిలేషన్ ఇచ్చి, సిగ్నల్ వద్దకు రాగానే సడెన్ (హార్ష్) బ్రేక్ వేయటం వలన మరింత ఎక్కువ ఇంధన ఖర్చయ్యి మైలేజ్ తగ్గిపోతుంది.

3. సరైన గేర్లను ఉపయోగించడం :- మనం వెళ్లే వేగాన్ని బట్టి గేర్లను మార్చుకోవాల్సి ఉంటుంది. డ్రైవింగ్‌లో సరైన గేర్‌ను ఉపయోగించకపోతే, ఇంజన్ ఇంధనాన్ని మంచినీళ్ల మాదిరిగా తాగేస్తుంది. ఉదాహరణకు తక్కువ స్పీడ్‌తో వెళ్తున్నప్పుడు ఎక్కువ గేర్‌లో ఉండటం లేదా ఎక్కువ స్పీడ్‌‌తో వెళ్తున్నప్పుడు తక్కువ గేర్‌లో ఉండటం చేయకూడదు. ఏ స్పీడ్ వద్ద ఏ గేర్‌ను ఉపయోగించాలనే విషయాన్ని మీ కార్ ఓనర్ మ్యాన్యువల్‌‍లో పేర్కొనబడి ఉంటుంది. ఒక్కసారి దాన్ని తిరగేసినట్లయితే, ఏయే సందర్భాల్లో ఏయే గేర్లను ఉపయోగించాలో ఇట్టే తెలిసిపోతుంది. గేర్లను మార్చడానికి బద్దకించిన లేదా సరైన గేర్‌ను ఉపయోగించడం తెలియని డ్రైవర్లు కొండ ప్రాంతాల్లో డ్రైవ్ చేసేటప్పుడు లేదా స్పీడ్ బ్రేకర్లను క్రాస్ చేసేటప్పుడు గేర్లను
 తగ్గించకుండానే డ్రైవ్ చేస్తుంటారు. ఇలా చేయటం వలన కావల్సిన దాని కన్నా ఎక్కువ ఇంధన ఖర్చు అవుతుంది. అంతేకాదు, దీని వలన ఇంజన్ మీద అధిక భారం పడి, లాంగ్ రన్‌లోఇంజన్పాడయ్యేఅకాశంకూడాఉంటుంది.

4. సిగ్నల్స్ వద్ద ఇంజన్ ఆఫ్ చేయండి :- ఇది అందరికీ తెలిసినదే. ఎక్కువ సమయం నిలిచి ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఇంజన్‌ను ఐడిల్‌గా ఉంచడానికి బదులుగా ఇంజన్‌ను ఆఫ్ చేయండి. సింపుల్‌గా చెప్పాలంటే, సిగ్నల్ వద్ద1 నిమిషం కన్నా ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వచ్చినప్పుడు ఇంజన్‌ను ఆఫ్ చేయటం మంచిది. అలాకాకుండా, తక్కువ సమయం (దాదాపు 1 నిమిషం) వేచి ఉండే సిగ్నల్స్ వద్ద మాత్రం ఇంజన్ ఆఫ్ చేయకండి. ఎందుకంటే, తిరిగి ఇంజన్‌ను స్టార్ట్ చేయడానికి మరింత ఎక్కువ ఇంధనం అవసరమవుతుంది.

5. ఏసిని పొదుపుగా వాడండి:- మనదేశంలోని అనేక నగరాల్లో రోడ్లు కాలుష్యం, దుమ్ము, ధూళితో నిండిపోయి ఉన్నాయి కాబట్టి, కారులో ప్రయాణిస్తున్న ప్రకృతి ప్రసాధించే సహజమైన గాలిని ఆస్వాదించటం కొంచెం కష్టంగానే ఉంటుంది. అందుకే, చాలా మంది కార్ వినియోగదారులు దాదాపు అన్ని వాతావరణాల్లోను కారులో ఎయిర్ కండిషన్‌ను ఉపయోగిస్తుంటారు. వాస్తవానికిఏసిఎక్కువపవర్ మరియుఇంధనాన్నివినియోగించుకుంటుంది.కాబట్టి,మరీఅవసరమైనప్పుడు
 మాత్రమే ఎయిర్ కండిషన్‌ను ఉపయోగించుకున్నట్లయితే, మంచి మైలేజీని పొందవచ్చు. సాధారణ సమయాల్లో ఎయిర్ కండిషన్‌కు బదులు విండోను కొద్దిగా ఓపెన్ చేసి బయటి గాలిని ఆస్వాదించండానికి ప్రయత్నించండి. ఎయిర్ కండిషన్ ఆన్‌లో ఉంచి డ్రైవ్ చేయటం వలన ఇంజన్ పెర్ఫామెన్స్, పవర్ తగ్గిపోవటమే కాకుండా మైలేజ్ కూడా భారీగా తగ్గుతుంది. కారు లోపలి వాతావరణం చల్లబడిందనిపిస్తే, ఏసి ఆఫ్ చేసి బ్లోయెర్‌నుఆన్‌లోఉంచుకోండి.

6. టైర్ ప్రెజర్ చెక్ చేసుకోండి :- వాహన మైలేజ్ విషయంలో టైర్లు కూడా కీలక భూమిక పోషిస్తాయి. డ్రైవర్ సైడ్ డోరుపై పేర్కొన్న మోతాదు ప్రకారం, ఆయా కార్లలోని టైర్లలో గాలి పీడనం ఉండేలాచూసుకోవాలి. టైర్లలో నిర్దేశితమోతాదు కన్నా తక్కువ గాలి ఉన్నట్లయితే, రన్నింగ్ లోడ్ పెరిగి మైలేజ్ భారీగా తగ్గిపోయే ఆస్కారం ఉంది. అంతేకాకుండా, తక్కువ గాలితో కూడిన టైర్లతో డ్రైవ్ చేయటం వలన లాంగ్ రన్‌లో టైర్ల జీవిత కాలం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. లో రోలింగ్ రెసిస్టెన్స్ కలిగిన టైర్లను అమర్చుకుంటే, వృధా అయ్యే శక్తిని తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీ కారులో అల్లాయ్ వీల్స్, లోప్రొఫైల్ టైర్లను అమర్చుకొని ఉండి, మీరు తరచూ లాంగ్ ట్రిప్‌లు చేస్తూ ఇంధనం ఆదా చేసుకోవాలనుకుంటే, తిరిగి రెగ్యులర్ టైర్లకు మారిపోవటం
మంచిది. ఇలాంటి హై-పెర్ఫార్మెన్స్ టైర్లు అధిక రోలింగ్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉండి మంచి గ్రిప్, హ్యాండ్లింగ్‌ను ఇస్తాయి, కానీ కార్ మైలేజీని మాత్రం భారీగా తగ్గిస్తాయి.

7. కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించండి:- కండిషన్‌లేని కారు నుంచి మంచి మైలేజ్ పొందటం చాలా కష్టం. అందుకే, కారును ఎప్పటికప్పుడు సర్వీస్ చేయించుకుంటూ, కండిషన్‌లో ఉంచుకోవాలి. కొత్త కారు విషయంలో సర్వీస్ బుక్‌లో తెలిపిన కిలోమీటర్లు/సమయం ప్రకారం సర్వీస్ చేయించుకోవాలి. అదే పాత కార్ల విషయంలో అయితే, ఎయిర్ ఫిల్టర్, స్పార్క్ ప్లగ్స్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేయుంచుకొని, అసరమైతే రీప్లేస్ చేసుకోవాలి. ప్రతి 60,000 కి.మీ. ఒకసారి కార్ ఆక్సిజెన్ సెన్సార్లను చెక్ చేయించుకోవాలి. ఫాల్టీ సెన్సార్ల వలన కార్ మైలేజ్ దాదాపు 20 శాతం
 వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఆక్సిజెన్ సెన్సార్ అనేది ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్ (కాలుష్య నియంత్రణ వ్యవస్థ)లో ఓ భాగం. ఇంజన్ మేనేజ్‌మెంట్ కంప్యూటర్‌కు డేటాను ఫీడ్ చేయటం ద్వారా ఇంజన్ సమర్థవంతంగా నడిచేందుకు ఇది సహకరిస్తుంది.

8. కారును తేలికగా ఉంచండి:- కారులో అనవసర బరువులు, వస్తువులను ఉంచకండి. దీని వలన పేలోడ్ పెరిగి మైలేజ్ తగ్గే ఆస్కారం ఉంది. అవసరం లేదనుకున్నప్పుడు రూఫ్ ర్యాక్‌లను తొలగించుకోవటం ఉత్తమం. ఇలా చేయటం వలన మైలేజ్ పెరగటమే కాకుండా, కారు కూడానీట్‌గాకనిపిస్తుంది.

9. వాతావరణంచల్లగాఉన్నప్పుడుఇంధనంపట్టించండి:-చల్లటివాతావరణాల్లో ఇంధన సాంధ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంధనం పట్టించడం మంచిది. ప్రత్యేకించి వేసవిలో ఇంధనాన్ని పట్టించుకోవాల్సివచ్చినప్పుడు,వీలైనంతవరకుతెల్లవారుజామునఇంధనాన్ని పట్టించుకుంటే, గాలికి ఇంధనం ఆవిరి అయ్యే అవకాశం ఉండదు. ఇంధనం పట్టించుకున్న ప్రతిసారి ఫ్యూయెల్ క్యాప్ సరిగ్గా బిగించారో లేదో చూసుకోండి, ఈ క్యాప్ సరిగ్గా బిగించకపోయినట్లయితే, ఇంధనం ఆవిరైపోయే ప్రమాదం ఉంటుంది.

10. ట్రిప్‌లను ముందుగానే ప్లాన్చేసుకోండి:-ప్రతిచిన్నదూరానికి/విషయానికి కారు ఉపయోగించడం వలన కూడా అనవసరంగా ఇంధనం వృదా అవుతుంది. కాబట్టి, వీలైనంత వరకు మీ ట్రిప్‌లను ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఉదాహరణకు.. మీరు వెళ్లే రూట్‌లో ఇంటి సరుకులు తీసుకోవాలనుకోవటం లేదా బట్టలు షాపింగ్ చేయాలనుకున్నారనుకోండి.
 ఈ రెండు పనులకు వేర్వేరుగా రెండుసార్లు కారును ఉపయోగించడానికి బదులుగా, ఒకేసారి రెండు పనులను పూర్తి చేసుకున్నట్లయితే, ఇంధనంతో పాటుగా సమయం కూడా ఆదా అవుతుంది. అలాగే, దూర ప్రయాణాలు లేదా కొత్త రూట్‌లలో ప్రయాణించాలనుకున్నప్పుడు మీ ట్రిప్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోండి. ప్రత్యేకించి కొత్త రూట్‌లలో వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్‌లు, రాంగ్ రూట్ల బెడదను తప్పించుకునేందుకు జిపిఎస్‌ను ఉపయోగించండి. ఒకవేళ జిపిఎస్ లేకపోతే, రూట్‌పై సందేహం వచ్చినప్పుడల్లా రోడ్డు పక్కన ఉండే వారిని అడిగి సరైన రూట్‌ను తెలుకోండి. ఇలా చేయటం వలన, సరైన రూట్లో సురక్షితంగా గమ్యం చేరుకోవటమే కాకుండా, ఇంధనాన్ని కూడా ఆదా
 చేసుకోవచ్చు.

11.రికమండెడ్ఫ్యూయెల్,లూబ్రికెంట్స్‌నువాడండి:-అనేకచమురుకంపెనీలుతమ ఇంధనాన్ని వాడితే మైలేజ్ పెరుగుతుందని, ఇంజన్ ఆయిల్స్ వాడితేఇంజన్ పవర్ పెరుగుతుందని ప్రకటనలతో ఊదరగొడుతుంటాయి. వాస్తవానికి, ఇలా ఏ కంపెనీ ఆయిల్ పడితే ఆ కంపెనీ ఆయిల్ వాడకూడదు. ఉదాహరణకు, మీ కారులో ఎక్కువ ధరతో కలిగిన అధిక ఆక్టేన్‌తో కూడిన ఇంధనం వాడితే మైలేజ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే, మీ కారు ఇంజన్‌ను ఆ ఇంధనంతో నడిచేలా డిజైన్ చేయబడి ఉండదు కాబట్టి. అలాగే ఇంజన్ ఆయిల్స్ కూడా రికమండెడ్ ఆయిల్స్‌ను మాత్రమే ఉపయోగించాలి. తక్కువ ధర కలిగిన లేదా నాసిరకం ఇంజన్ ఆయిల్‌ను ఉపయోగించడం వలన మైలేజ్ తగ్గడమే కాకుండా, ఇంజన్పాడయ్యేఆస్కారంకూడాఉంటుంది. కాబట్టి, కారు ఓనర్ మ్యాన్యువల్‌లో లేదా అధీకృత సర్వీస్ఇంజనీర్లుసూచించే ఇంజన్ ఆయిల్‌ను మాత్రమే ఉపయోగించాలి.

12. ఆటోమేటిక్ కారును మ్యాన్యువల్ మోడ్‌లో డ్రైవ్ చేయండి:- అనేక రకాల ఆటోమేటిక్ గేర్ బాక్స్‌లు ఒక నిర్ధిష్ట వేగాన్ని వెళ్లడానికి ముందు వరకు అప్‌షిఫ్ట్ కావు. అలాంటప్పుడు ఇంజన్‌పై భారం పడి, అప్‌షిఫ్ట్ కోసం ఎక్కువ ఇంధనం వినియోగం అవుతుంది. అందుకే, చాలా వరకు ఆటోమేటిక్ కార్లు మ్యాన్యువల్ కార్ల తక్కువ మైలేజీనిస్తుంటాయి. వాస్తవానికి ఆటోమేటిక్ కార్లను మ్యాన్యువల్ మోడ్‌లో డ్రైవ్ చేసే వెసలుబాటు కూడా ఉంటుంది. కాబట్టి, సరైన స్పీడ్ వద్ద మ్యాన్యువల్‌గా సరైన గేర్‌ను ఎంచుకున్నట్లయితే,
 సిటీ రోడ్లపై మెరుగైన మైలేజీని పొందవచ్చు.

13. భారీ వాహనాలను ఫాలో అవ్వండి:- మీ గమ్యాన్ని చేరుకోవటానికి మీకు తొందర లేనట్లయితే, ఇలా ప్రయత్నించండి. భారీ వాహనాలను ఫాలో అవతూ డ్రైవ్ చేయటం చాలా స్ట్రెస్-ఫ్రీ (ఒత్తిడి లేకుండా)తో కూడుకున్నది. ఎందుకంటే, సాధారణంగా ఇలాంటి వాహనాలు స్మూత్‌గా లైన్లను మారుతూ, ట్రాఫిక్‌లో కానీ లేదా హైవేలో కానీ ముందు వెళ్లే వాహనాలను దాటుకుంటా, వెనుక వచ్చే వాహనాలకు మార్గం చేస్తూ వెళ్తుంటాయి. సురక్షితమైన దూరం నుంచి బస్సు లేదా ట్రక్కును ఫాలో చేస్తూ పోతే, ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ప్రయాణించవచ్చు. అయితే, ఇలా చేయటం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదనుకోండి.

14. స్టార్ట్ అవడానికి ముందే డ్రైవ్‌కు సిద్ధం కండి:- డ్రైవ్ చేయటానికి పూర్తిగా సిద్ధమైన తర్వాతనే కారును స్టార్ట్ చేయండి. అలాకాకుండా, కారును స్టార్ట్ చేసిన తర్వాత సన్‌గ్లాసెస్ కోసం వెతకటం, సీట్ బెల్టును పెట్టుకోవటం, డోర్లను లాక్ చేయటం లేదా వేరే ఎవరికోసమైన వేచి ఉండటం వంటివి చేయటం వలనం కారు ఇంజన్ ఐడిల్‌గా ఉండిఅనవసరంగాఇంధనంఖర్చుఅవుతుంది. అందుకే, ఇంజన్ స్టార్ట్ చేయటానికి ముందే ఇవన్నీ చేసుకుంటే, ఇంధనం ఆదా అవుతుంది.

15. రివర్స్ పార్క్ :-రివర్స్పార్క్చేయటంవలనకూడాఇంధనంఆదాఅవుతుంది. అదెలా అంటే, మీ ఇంట్లో కారును పార్క్ చేసుకునేందుకు గ్యారేజ్ ఉన్నట్లయితే,  కారును సులువు బయటకు తీసుకునేందుకు వీలుగా కారును ఇంటికి ఎదురుగా ఉండేలా కాకుండా రివర్సులో ఉండేలా పార్క్ చేసుకున్నట్లయితే, తర్వాతి రోజును కారును బయటకు తీయటానికి ఎక్కువ
 సమయం పట్టదు. దీని వలన సమయం, ఇంధనం రెండూ కూడా ఆదా అవుతాయి.















0 comments:

Post a Comment